AP News: నేడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్
AP News: ఏపీలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. జగన్ మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలే నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి జగనన్నకు చెబుదాం’ అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీనిని చేపడుతున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాంస్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు 1902ను ఏర్పాటు చేసింది. ఆ నంబరుకు ఫోను చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని నమోదు చేసుకొని పరిష్కరిస్తారు. వాటి పరిష్కార క్రమాన్ని ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుడికి తెలియజేస్తారు.
సంక్షేమ కార్యక్రమాలు, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వైసీపీ సర్కార్ పేర్కొంది.
Also Watch
Rahul Gandhi: బస్సు ప్రయాణం లో కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి
వైఎస్సార్ పెన్షన్ కానుక లేదా రేషన్ కార్డు పొందడం వంటి విషయాల్లో ఏవైన ఇబ్బందులు ఎదురైనా లేదా ప్రభుత్వ పథకాలు అందుకోవడంతో ఏవైన సమస్యలు ఉన్న టోల్‌ఫ్రీ నంబరు 1902 కు ఫోన్ చేయవచ్చు. గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలన్నారు. హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్ వస్తాయని చెప్పారు.
వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలని నిర్దేశించారు. గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ ను రిజిస్టర్ చేయటం, విచారించటం, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయటం జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలుగా నిర్ణయించారు. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్ అప్డేట్స్ అందేలా ఏర్పాట్లు చేసారు.