Corona Virus: కరోనా మళ్లీ విజృభిస్తుంది.. HKU1 కరోనా వేరియంట్.. కోల్ కత్తా మహిళకు కరోనా!

భారతదేశంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. కలకత్తాలోని ఓ మహిళకు అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ హెచ్ కేయూ1 సోకిందని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని మళ్లీ ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం కలకత్తాలో HKU1 వైరస్ బారిన పడిన మహిళను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ వైరస్ గతంలో వచ్చిన కరోనా లాంటిదేనా లేక అంతకంటే ఎక్కువా అనేది ఇంకా తెలియదు.

కోల్ కత్తాలో 45 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ సోకినట్టు టెస్టుల ఆధారంగా వైద్యులు గుర్తించారు. ఆమెకు గత 15 రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మహిళను దక్షిణ కోల్ కత్తా లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె కోవిడ్ బారిన పడిన సమయంలో ప్రతి ఒక్కరిలో ఆందోళన కొనసాగుతుంది.

HKU1 హ్యూమన్ కరోనా వైరస్ ఆందోళన మళ్లీ కరోనా వ్యాప్తి జరుగుతుందా, మళ్లీ లాక్ డౌన్ నాటి పరిస్థితులు వస్తాయా? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఈ వైరస్ తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కలిగించగలదు. ఇది తీవ్రతరమయితే బ్రాంకైటిస్, న్యుమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.

వైద్యులు ఈ వైరస్ సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడిపోతుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కరోనాకు సంబంధించిన ముందు తీసుకున్న జాగ్రత్తలు, అలాగే ఈ కరోనాకు కూడా అనుసరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, అనారోగ్యం అనిపిస్తే బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం, సామాజిక దూరం పాటించడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు మూసుకోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

హ్యూమన్ కరోనా కార్డియో పల్మొనరీ వ్యాధి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. అందుకే జాగ్రత్తలు పాటించి, దీని నుండి కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply