Ap Tidco Houses: ఈ నెల 19వ టిడ్కో ఇళ్ల కాలనీలను ప్రారంభించనున్న ఏపీ సీఎం
Ap Tidco Houses: వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో జనం మధ్యే గడపడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. సంక్షేమ పధకాలతో ముందుకు దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వం ఈ నెల 19న కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు . ఈ పర్యటన లో భాగంగా గుడివాడలో టిడ్కో ప్లాట్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం పరిశీలించారు. ఎమ్మెల్సీ రఘురాం, అధికార బృందానికి లేఔట్ మొత్తం తిప్పి చూపించారు మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
ఈ నెల 19న గుడివాడ, 22న మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటిస్తారని కొడాలి నాని తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే సీఎం పర్యటన అవాంతరాలు లేకుండా నిర్వహిస్తామన్నారు. టీడీపీ హయంలో నామమాత్రంగా 1200 ప్లాట్ల నిర్మాణం జరిగితే, వైసీపీ పాలనలో 9వేల ప్లాట్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు కొడాలి నాని. రూ.900 కోట్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులతో టిడ్కో లేఔట్ అభివృద్ధి చేశామని తెలిపారు. లబ్ధిదారుల తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాన కొడాలి నాని. సీఎం జగన్ పర్యటనలో గుడివాడ ప్రజానీకం పాల్గొనాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
Also Watch This
ఈ రెండు చోట్ల కూడా టిడ్కో ఇళ్ల కాలనీలను ప్రారంభిస్తారు. మొత్తం 300 ఎకరాల్లో అభివృద్ధి చేసిన టిడ్కో లే అవుట్ ఇది. ఇందులో 8,912 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. 900 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను కల్పించింది. నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో- వాటిని లబ్దిదారులకు అందజేయనున్నారు జగన్. గుడివాడ టిడ్కో కాలనీ ఒకే చోట వేలాది ఇళ్లను నిర్మించడంలో అతిపెద్ద హౌసింగ్ కాలనీ. అంతేకాకుండా, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6వేల 700 వ్యక్తిగత ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల 872 ఇళ్లు నిర్మాణం జరుగుతోంది. అలాగే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని పరిశీలించారు. తన సొంత నియోజకవర్గానికి జగన్ రానున్నందున దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారాయన. జిల్లా గృహనిర్మాణ శాఖ, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అలాగే ఈ నెల 12వ తేదీన వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించనున్నారు. చుక్కల భూముల పట్టాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. గతంలో చుక్కల భూముల సమస్యలను ప్రభుత్వ పరిష్కరించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా జీఓ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ చుక్కల భూముల పట్టాలను రైతులకు పంపిణీ చేయనున్నారు.