TDP: లోకేష్ ను ఎక్కడ కాలవాలో అడిగిన వైసీపీ ఎమ్మెల్యే
TDP: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వీటిపై ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు స్పందించి ప్రతి సవాళ్లు విసురుతున్నారు. మరికొందరు ఘాటు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు.
ఇదే క్రమంలో కర్నూల్లో యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముఖ్యంగా కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హఫీజ్ ఖాన్ స్దానికంగా ఉన్న పలు స్ధలాల్ని ఆక్రమించుకుంటున్నట్లు లోకేష్ ఆరోపణలు చేశారు. దీంతో లోకేష్ ఆరోపణలపై స్ధానికంగా చర్చ మొదలైంది. ఈ ఆరోపణల పై హఫీజ్ ఖాన్ స్పందించక తప్పలేదు. లోకేష్ ఆరోపణలపై స్పందించిన హఫీజ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు.
Also Read This
పాదయాత్రలో నారా లోకేష్ తనపై చేసిన భూకబ్జా ఆరోపణలపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. నేను భూకబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నారా లోకేశ్ నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, అప్పుడే కర్నూలు దాటి వెళ్లాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. నారా లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నీవు ఉన్న టెంటు దగ్గరకు వస్తా అక్కడే చర్చిద్దాం. నాపై ఆరోపణలు రుజువు చేయకపోతే నారా లోకేశ్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నాపై చేసిన ఆరోపణలపై నేను దేనికైనా సిద్ధమే.
అయితే పాదయాత్రలో ఎక్కడ కలవాలో చెప్పి లోకేష్ మర్యాద కాపాడుకోవాలి. అలా కాకపోతే ఈరోజు సాయంత్రంలోపల ఎక్కడో ఒకచోట నేను పాదయాత్రలోకి వస్తానని కర్నూల్ ఎమ్మెల్యే చెప్పారు. నీ పాదయాత్ర దగ్గరకు వచ్చే సమయంలో నా అనుచర గణం కానీ, పార్టీ కార్యకర్తలుగానీ ఎవరు రారు. కేవలం నేను ఒక్కడినే వస్తాను. నాపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని అన్నారు. నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు, ప్రజలకు పనిచేసేందుకు అమెరికాలోని లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చిన వ్యక్తిని నేను. అలాంటినాపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ హెచ్చరించారు.