Dog Attacks: దాడిలో మరో చిన్నారి బలి
Dog Attacks: దేశంలో అరగంటకు ఒకరు కుక్క కాటుతో చనిపోతున్నారనే సర్వేలు నిజమని నిరూపితమౌతున్నాయి. ఈ కుక్కల దాడికి అనేక మంది బాధితులవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల అనేక మంది చిన్నారులు వీధి కుక్కల దాడిలో మృతి చెందారు. తాజాగా మరో చిన్నారి అత్యంత ఘోరంగా కుక్కలకు బలి అయింది.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో ఈ దారుణం చోటు చేసుకుంది. మెట్టవలస గ్రామానికి చెందిన పైల రాంబాబు, రామలక్ష్మి రెండవ కుమార్తె సాత్విక (18 నెలలు) వీది కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో చిన్నారిపై సుమారు 4 వీధికుక్కలు వరకు వచ్చి దాడి చేసి పక్కన వున్న తోటలోకి ఈడ్చుకు పోవడం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు అయితే, ఆ చిన్నారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాత్విక కన్నుమూసింది పసిపాప మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు కుక్కల నియంత్రణపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో వీధి Dog Attacks ఇటీవల పెరిగాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని అంబర్పేటలో ఓ నాలుగేళ్ల బాలుడిపై ఒ కుక్కల గుంపు దాడి చేసి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో పలువురు Dog Attacks లో గాయపడ్డారు. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం.