BJP: ఈటల రాజేందర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

BJP

BJP: ఈటల రాజేందర్ ను భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలంటూ సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

BJP: కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (BJP)మధ్య చెలరేగిన మునుగోడు మంటలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.  మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

ఈ క్రమంలో ఈటల రాజేందర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఈటలకు దమ్ముంటే ప్రమాణం చేయడానికి భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలన్నారు. శనివారం  సాయంత్రం 6గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేద్దాం అన్నారు. తాను డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టేసి చెప్తానన్నారు రేవంత్ రెడ్డి.

అయితే శనివారం సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తా, డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల కూడా గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలని చాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి. భాగ్యలక్ష్మి అమ్మవారు BJP నేతలకు అత్యంత నమ్మకమైన దేవత   ఒకవేళ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఈటలకు నమ్మకం లేకుంటే మరో ఆలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏంటో రాజేందర్ కి తెలుసు భాగ్యలక్ష్మి గర్భగుడిలో ప్రమాణం చేసేందుకు  నేను సిద్ధం. నీచ రాజకీయం కోసం ఈటల క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. చిల్లర ఆరోపణలు చేసే వారు నాకు చిత్తు కాగితంతో సమానం.” – రేవంత్ రెడ్డి ద్వాజమెత్తారు

కానీ మునుగోడు ఎన్నికల్లోనే కాదు, కేసీఆర్  నుంచి అనా పైస కూడా ముట్టలేదని చెప్పుకొచ్చారు. అయితే మునుగోడులో ఖర్చుచేసిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలదే అని అన్నారు. రాజకీయాల కోసం ఈటల రాజేందర్ ఇంతలా దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను ఈటల 24 గంటల్లో నిరూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని ఎన్నికల ముందైనా తర్వాతైనా రెండు పార్టీలు కలుస్తాయని ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు పంపించారన్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవేళ్ళ సభలో పాల్గొంటారని, దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు భరించేంత వేల కోట్లు ఎలా వచ్చాయో ముఖ్యమంత్రి చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh