JIO: సినిమా యూజర్లకు భారీ షాక్
JIO: సినిమా యాప్‌లో ఫ్రీగా ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాలిసిందే,జియోసినిమా యాప్ త్వరలో డబ్బులు వసూలు చేయనుంది. ఫ్రీ కంటెంట్‌కు స్వస్తి పలకనుంది!
ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న వయాకామ్ 18.. జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా ఐపీఎల్ ప్రసారాలను అందిస్తోంది. తర్వాత JIO సినిమా యాప్‌కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేస్తున్నట్లు సంస్థ చేసిన ప్రకటనతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
ఏ నెట్వర్క్ వారైనా ఉచితంగానే ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్నారు. దీంతో వ్యూయర్షిప్లో రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ విషయంలో గతంలో నమోదైన రికార్డులన్నీ ఈసారి జియో సినిమా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే, ఇకపై ఫ్రీ కంటెంట్ విషయంలో జియో సినిమా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తోన్న రిలయన్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను JIO సినిమా యాప్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.
దీంతో నెట్‌ఫ్లిక్స్, వాల్ట్ డిస్నీ వంటి అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడాలని రిలయన్స్ భావిస్తోంది.అంతే కాకుండా కంటెంట్‌కు ఇకపై డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతలోనే ఓ కీలక నిర్ణయాన్నీ వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు మాత్రం ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని ప్రకటించింది.
ఐపీఎల్ పూర్తైన తర్వాతే జియో సినిమా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మే 28తో ముగియనున్నాయి. ఆ సమయంలోపే కొత్త కంటెంట్‌ను యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తోందని జ్యోతి దేశ్ పాండే తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లను మాత్రం యథాతథంగా ఉచితంగా చూడొచ్చని చెప్పారు.
JIO సినిమాకు వసూలు చేసే మొత్తాన్ని అందుబాటు ధరలోనే ఉంచాలని చూస్తున్నామని, దానికి తోడు దేశీయ కంటెంట్‌ను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలోనే 5.5 బిలియన్ యునిక్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న జియో సినిమా ఏప్రిల్ 12న జరిగిన చెన్నై- రాజస్థాన్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 22 మిలియన్ల మంది చూశారని ఆ సంస్థ తెలిపింది.
ఐపీఎల్‌కు ముందు కూడా జియో సినిమా యాప్ ఉన్నప్పటికీ యూజర్ బేస్ చాలా తక్కువ ఐపీఎల్ ప్రసారాలతోనే పెద్ద సంఖ్యలో యూజర్లను పోగు చేసుకుంది జియో సినిమా.
అయితే, క్రికెట్ అభిమానులే కాకుండా ఇతర ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు జియో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి ఓటీటీలకు పోటీగా JIO సినిమాను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
జియో సినిమాలో కొత్తగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ కంటెంట్ బిజినెస్ విభాగ అధిపతి జ్యోతి దేశ్‌పాండే ఇటీవల వెల్లడించారు.
కొత్త కంటెంట్ చేరిన తర్వాత జియో ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. అయితే, దీనిపై జ్యోతి దేశ్‌పాండే పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఛార్జీల విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఐపీఎల్ ఫైనల్‌కు ముందే కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయినప్పటికీ ఉచితంగానే ఐపీఎల్‌ను చూడొచ్చని పేర్కొన్నారు.