గుడ్ న్యూస్ భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర ఎంతంటే ?

LPG Cylinder Rates: గుడ్ న్యూస్ భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర ఎంతంటే ?

మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్. వంట గ్యాస్ ధర భారీగా తగ్గింది. గత కొన్ని నెలలుగా వంట గ్యాస్ ధర పెరుగుతూ ఉండటంతో వినియోగదారులపై అదనపు భారం పెరిగింది. ఈ నెల నుండి సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆరు నెలలుగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ నెల ఉపశమనం కలిగింది.2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు గ్యాస్‌ ధరలపై గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది.

ఏప్రిల్ 1వ తేదీన వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది.. అయితే, రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారుల మాత్రం ఎలాంటి ఉపశమనం లేదు.. కాగా, 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలోనే పెంచింది ప్రభుత్వం గత నెలలో, కేంద్రం దేశీయ వంట గ్యాస్ ధరలను రూ.50 పెంచిన విషయం విదితమే. ముఖ్యంగా, మార్చిలో ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది.. ఇప్పుడు రూ.92 తగ్గించింది.

ఇతర రాష్ట్రాలలో కూడా ఇంచుమించు సబ్సిడీ లేని వంట గ్యాస్ ధర 50 రూపాయలు తగ్గింది. వినియోగదారులు వంటగ్యాస్ ధరలు తగ్గినా పెద్దగా ఆనందపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ఆరు నెలలలో పెరిగిన మొత్తంతో పోల్చి చూస్తే తగ్గింది చాలా తక్కువ. అందువలన రేట్లు తగ్గినా వినియోగదారులపై భారం మాత్రం పెద్దగా తగ్గలేదు. ముంబైలో గ్యాస్ బండ ధర రూ.776.5 ఉండగా ఢిల్లీలో ధర రూ. 805.5 గా ఉంది.

ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. ఒకటో తేదీన సిలిండర్ ధర పెరగొచ్చు… లేదా తగ్గొచ్చు.. కేంద్రం ప్రస్తుతం ప్రతి కుటుంబానికి సబ్సిడీ కింద 12 సిలిండర్లను అందిస్తోంది. వీటికి అదనంగా సిలిండర్ కావాలనుకున్న వినియోగదారులు మార్కెట్  ధర చెల్లించాలి. ప్రతి నెలా ఎల్పీజీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సమీక్షిస్తూ ఉంటాయి. డాలర్ – ఇండియన్  మారకపు విలువ, అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ రేట్లు అంశాల ప్రాతిపదికన ధరలు మారుతూ ఉంటాయి.

దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల మాదిరిగా కాకుండా, వాణిజ్య గ్యాస్ ధరలు హెచ్చుతగ్గులకు నడుమ ఉంటాయి. 1 ఏప్రిల్ 2022న, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ ధర రూ. 2,028 రూపాయలకు తగ్గించబడ్డాయి. గత ఏడాది కాలంలో ఢిల్లీలో మాత్రమే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు రూ.225 తగ్గాయి. ప్రత్యేకంగా, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. గత నెలలో, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఉజ్వల యోజన యొక్క 9.59 కోట్ల మంది లబ్ధిదారులు సంవత్సరానికి ప్రతి 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని పొందుతారు. కేంద్రం ఏడాదికి 12 సార్లు రీఫిల్ పరిమితిని విధించిందని ప్రకటించిన విషయం విదితమే.

తాజాగా సవరించిన రేట్ల తర్వాత ఇండేన్ గ్యాస్ సిలిండర్ ధరలు (19 కిలోల సిలిండర్): ఢిల్లీలో రూ.2028గా, కోల్‌కతాలో రూ.2132గా, ముంబైలో రూ.1980గా.. చెన్నైలో రూ.2192.50గా ఉంది.. ఇక, ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలను ఓసారి పరిశీలిస్తే.. శ్రీనగర్‌లో రూ.1,219, ఢిల్లీలో రూ.1,103, పాట్నాలో రూ.1,202, లేహ్‌లో రూ.1,340, ఐజ్వాల్‌లో రూ.1255, అండమాన్‌లో రూ.1179, అహ్మదాబాద్‌లో రూ.1110, భోపాల్‌లో రూ.1118.5, జైపూర్‌లో రూ. 1116.5, బెంగళూరులో రూ. 1115.5, ముంబైలో రూ. 1112.5, కన్యాకుమారిలో రూ.1187, రాంచీలో రూ.1160.5, సిమ్లాలో రూ.1147.5, దిబ్రూగర్‌లో రూ.1145, లక్నోలో రూ.1140.5. ఉదయపూర్‌లో రూ.1132.5, ఇండోర్‌లో రూ.1131, కోల్‌కతాలో రూ.1129, డెహ్రాడూన్‌లో రూ.1122, విశాఖపట్నంలో రూ.1111, చెన్నైలో రూ. 1118.5, ఆగ్రాలో రూ. 1115.5, చండీగఢ్‌లో రూ. 1112.5గా ఉన్నాయి..

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh