70 వ సంవత్సరం 70 అడుగులతో Khairatabad Ganesha

70 వ సంవత్సరం 70 అడుగులతో Khairatabad Ganesha

70 వ సంవత్సరం 70 అడుగులతో Khairatabad Ganesha

హిందువులు జరుపుకునే పండుగలలో వినాయకచవితి ఒకటి . ఈ వినాయక చవితి పండగ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది .

ముఖ్యంగా వినాయకుడుకి అగ్ర పూజ్యుడిగా ఒక వరం కూడా ఉందని పురాణాలలో తెలుపబడింది . అందుకే హిందువులు జరుపుకునే ఏ పండుగలోనైనా ,

ఏ పూజలోనైనా ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయతీగా వస్తోంది . అంతే కాక వినాయకుడిని విఘ్నాలకు అధిపతి గా కూడా చెబుతారు .

అంటే మనం ఏ పనినైనా ప్రారంభించేముందు వినాయకుడికి పూజ చేసి లేదా వినాయకుడిని తలుచుకొని ప్రారంభిస్తే ఆ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని నమ్ముతారు .

అయితే హిందువులు ప్రత్యేకంగా వినాయకుడికి వినాయకచవితి అనే పండుగను జరుపుతారు .

ఈ పండుగను భాద్రపదమాసం ప్రారంభమైన నాలుగవ రోజు అనగా చవితి రోజున జరుపుకుంటారు

. ఈ రోజున వినాయకుడు జన్మించినందున ఈ రోజును వినాయకచవితి గా ప్రతీ సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగ వస్తోంది .

అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదీ శనివారం వినాయకచవితి వచ్చింది . ఇక ఆ రోజు నుండి వరుసగా 9 రోజులు గణేష్ నవరాత్రులను జరుపుతారు .

అలాగే వినాయకుడిని గణపతి , విఘ్నేశ్వరుడు , గణేశుడు ,లంబోదరుడు అని పలు పేర్లతో పిలుస్తారు .

ఈ వినాయకచవితి పండగను దేశం మొత్తం మీద చాలా ప్రాంతాలలో జరుపుకుంటారు .

ముఖ్యంగా తెలంగాణ లోని హైదరాబాద్ లో ఖైరతాబాద్ లోని గణేష్ నవరాత్రులుకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది .

ఖైరతాబాద్ వినాయకుడి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతీ సంవత్సరం ఒక్కో అడుగు చొప్పున పెంచుతూ విగ్రహాన్ని తయారుచేస్తారు .

మొట్టమొదట కేవలం ఒక్క అడుగు తో ప్రారంభమైన ఈ విగ్రహం ఈ సంవత్సరం తో 70 ఏళ్లు పూర్తికావడంతో 70 అడుగుల విగ్రహాన్ని ఈ సంవత్సరం నిలపెట్టబోతున్నట్లు ఇప్పటికే

నిర్వహణాధికారులు తెలిపారు . ఈ విగ్రహాన్ని చాలా మంది విగ్రహ కళాకారులు తమ నైపుణ్యంతో విగ్రహానికి ప్రాణం పోసినట్లు తయారుచేస్తారు .

అయితే ఈ సంవత్సరం ఈ విగ్రహాన్ని సప్త ముఖ వినాయకుడిగా తయారుచేశారు . వినాయకుని ముఖం తో పాటు మరో ఆరుగురి దేవతా మూర్తుల ముఖాలు ఉన్నాయి .

అంతేకాక వినాయకుడి తల మీద 7 సర్పాలు ను కూడా ఏర్పాటు చేశారు . అలాగే వినాయక విగ్రహం కుడి భాగాన విష్ణుమూర్తి ,

లక్ష్మీదేవి విగ్రహం మరియు ఎడమ పక్కన శివ పార్వతుల విగ్రహం ను ఏర్పాటు చేశారు .

అంతే కాకుండా ఈ ఏడాది తో 70 సంవత్సరం లు పూర్తి కావడంతో ఖైరతాబాద్ గణేషుడిని చూడడానికి అలాగే గణేష్ నవరాత్రులును జరపడానికి భక్తులందరూ ఎంతో ఆసక్తి గా

ఎదురుచూస్తున్నారు అలాగే ప్రతీ ఏట ఈ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.

70 వ సంవత్సరం 70 అడుగులతో Khairatabad Ganesha

Ganesh Chaturthi 2023: వినాయక చవితి ఆ రోజే.. భక్తులు ధర్మసందేహానికి వేద  పండితుల క్లారిటీ.. - Telugu News | Kanipakam Temple Priest Gives Clarity on Vinayaka  Chavithi Festival | TV9 Telugu

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh