హైదరాబాద్ బంజారాహిల్స్ ఎస్సై సాహసం చేసి 16 మంది నిండు ప్రాణాలు కాపాడారు. పోలీసులు ఆపద సమయంలో ఆదుకునే మానవత్వం కూడా ఉంటుందని నిరూపించుకున్నారు బంజారాహిల్స్ ఎస్సై. ఏకంగా 16 మంది ప్రాణాలు కాపాడి అందరిచేత సభస్ అనిపించు కుంటున్నారు. వివరాలలోకి వెళ్తే ఈ రోజు పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థులను అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌లో ఎక్కించారు. డీసీఎం లో అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు ఖైరతాబాద్ వైపు తరలిస్తున్నా నైపద్యంలో డీసీఎం నడుపుతున్న హోంగార్డు రమేష్‌కి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి.
దీంతో డీసీఎం అదుపుతప్పింది. ఆ వాహనానికి ఇన్- చార్జిగా బంజారాహిల్స్‌కు చెందిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఎస్సై తో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది వ్యానులో కూర్చున్నారు. అదుపు తప్పిన డీసీఎం డివైడర్ మీదికి దూసుక వెళ్తున్న సమయంలో ఆ బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి గమనించారు. గమనించిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి వెంటనే అప్రమత్తమై నడుస్తున్న వాహనం నుంచి కిందికి దూకి వాహనం ముందువైపు పరుగులుటిసి డ్రైవర్ కూర్చున్న డోర్ తెరిచి స్టీరింగ్ పట్టుకుని బ్రేక్ వేశారు.
దీంతో వాహనం రోడ్డు పక్కనున్నపెద్ద పూలకుండీని ఢీకొట్టి ఆగి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎస్సై కరుణాకర్‌రెడ్డితోపాటు హోంగార్డు రమేశ్, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. గాయ పడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందర్నీ కాపాడిన కరుణాకర్ రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు. ఎస్సై కరుణాకర్ రెడ్డి చేసిన సాహసానికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.