తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ప్రకటించి మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. రూ.5వేల 350 కోట్ల తో వేలాది చెరువుల పునరుద్ధరణ జరిగింది.చెరువుల పునరజ్జీవనంతో 25లక్షల 92వేల 437 ఎకరాలు సాగులోకి రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.అలాగే రూ.3,825 కోట్లతో 12వేల చెక్ డ్యామ్‌ల నిర్మాణాలను ప్రభుత్వం చేట్టింది. అడుగంటి పోయిన భూగర్భ జలాలు మిషన్ కాకతీయ, చెక్ డ్యాల నిర్మాణంతో భూగర్భంలో 680 టీఎంసీల నీరు వృద్ధి చెందింది.
అలాగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా గురువారం నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్‌గోపాల్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువు వద్ద ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడు తూ చెరువల పండుగలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి రాయారావు చెరువు వరకు బతుకమ్మ, బోనాల ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం కట్ట మైసమ్మ ఆల యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఉన్నారు.
రామాయంపేటలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఇన్‌చార్జి కమిషనర్ ఉమాదేవి పిలుపునిచ్చారు. మున్సిపల్ పాలకవర్గం తో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, చెరువుల పండుగ ఏర్పాట్లపై చర్చించారు. రామాయంపేటలోని మల్లె చెరువు వద్ద చెరువు పండుగ నిర్వహిస్తామన్నారు. చెరువు పండుగ సందర్భంగా వెయ్యి మందికి భోజనాలను సిద్ధ్దం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా లోపాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు. మల్లె చెరువు వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు. సమావేశంలో మేనేజర్ శ్రీనివాస్, రిసోర్స్‌పర్సన్లు ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణతో ఆగిపోకుండా వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నది. తెలంగాణ భూ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. సమైక్యపాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. కాకతీయులు చూపిన బాటలో సీఎం కేసీఆర్ చేసిన బృహత్తర ఆలోచనే.. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించబడిన చెరువులను ఆయా బేసిన్ల పరిధిలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేశారు. ఇప్పటివరకు దాదాపు 15 వేల చెరువులకుపైగా ప్రాజెక్టులతో ముడిపెట్టారు. ఆయా పంటకాలువలకు ఎక్కడికక్కడ ఓటీలను ఏర్పాటు చేసి చెరువులను క్రమం తప్పకుండా ప్రాజెక్టు నీటితో నింపుతున్నారు. ఫలితంగానే నేడు ఎండాకాలంలో సైతం పూర్తిస్థాయి నీటి నిల్వతో చెరువులు నిండుగా దర్శమిస్తున్నాయి. మరోవైపు వాగుల పునరుజ్జీవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 650 నిర్మాణాలు ప్రారంభించి 400 మేరకు పూర్తి చేసింది.
పదేళ్ల క్రితం…
ఏ చెరువును చూసినా గుండెబరువు
వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువుకానీ..
దశాబ్ది ఉత్సవాల వేళ
ప్రతి చెరువు…
కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుచుక్కనీరు లేక చిక్కిశల్యమైన
అమ్మలాంటి ఊరి చెరువుకు
ఊపిరిపోసిన నాయకుడు…గొలుసుకట్టు చెరువుల
గోస… pic.twitter.com/RlS40x3CEY— KTR (@KTRBRS) June 8, 2023