dogs attack on three years boy: వీధి కుక్కల దాడిమూడేళ్ల బాలుడి తీవ్ర గాయాలు
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకు కుక్క కాటు భాదితులు పెరుగుతున్నారు ఇటీవల కాలంలో మరి ఎక్కువైన శునాకల దాడులతో ప్రజలు బయటకు రావాలంటే భయాపడుతున్నారు. ఏ వైపు ఏకుక్క దాడి చేస్తుందో అని భయాందోళనకు గురివుతున్నారు. బయటకు వెళ్ళిన వ్యక్తులు ఇంటికి క్షేమంగా తిరిగీ వచ్చేవరకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కాలం వెళలబుచ్చుతున్నారు . తాజాగా కుక్కల దాడిలో మరో మూడేళ్ల బాలుడు బలి
అసలు వివరాలలోకి వెళ్ళితే నాగ్‌పూర్‌లోని అన్మోల్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే దంపతుల మూడేళ్ల కుమారుడు డుగ్గూ దూబే మంగళవారం (ఏప్రిల్ 11) ఉదయం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న వీధి కుక్కలు అతడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడు కిందపడిపోగా నలువైపుల నుంచి ఈడ్చుకుంటూ కాళ్లు, వీపు, మెడ భాగంలో కరిచాయి.
బాలుడి ఏడుపు విని డుగ్గూ తల్లి బయటకు పరుగెత్తుకొచ్చింది. అక్కడ దృశ్యం చూడగానే ఆమెకు గుండె ఆగినంత పనైంది. కుక్కలను తరిమేసి బాలుడిని ఇంటి లోపలికి తీసుకెళ్లింది. గాయాలను శుభ్రం చేసిన తర్వాత బంధువుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది.
వైద్యులు బాలుడికి వెంటనే యాంటీ రేబిస్ టీకా ఇచ్చారు. గాయాలను శుభ్రం చేసి అవసరమైన చికిత్స అందించారు. 24 గంటలు తర్వాత బాలుడిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. పీడకల లాంటి ఆ ఘటనను గుర్తు చేసుకొని బాలుడి తల్లి ఇప్పటికీ వణికిపోతున్నారు.
Stray dogs made a target of a four-year-old child in Nagpur, Maharashtra.
More than 6 stray dogs attacked the child.#straydogs #Dog #dogattack #straydogs #animalattack #india #dogs #Maharashtra #nagpur #viral #viralvideo pic.twitter.com/iVVby3KkWZ
— Siraj Noorani (@sirajnoorani) April 13, 2023