విజయడాలో రైల్వే స్టేషన్లో బంగరం పట్టివేత

విజయడాలో రైల్వే స్టేషన్లో బంగరం పట్టివేత

బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్ లో సుమారు రూ.7.5 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.  ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్నా సందర్భంలో విజయవాడ రైల్వేస్టేషన్లో అధికారులు పట్టుకున్నారు.  కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

పక్కా సమాచారంతోనే అధికారులు ఈ దాడులు నిర్వహించి ఐదు కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని అదుపులోకి తీసుకుని  వారి వద్ద ఉన్న 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  రాష్ట్రంలోని వివిధ కస్టమ్స్ విభాగాలకు చెందిన 30 మంది అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

కాగా ఈటీపీ (ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) ద్వారా 770 కిలోల ఎన్డీపీఎస్ వస్తువులను ధ్వంసం చేసినట్లు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్)ను మంగళవారం (మార్చి 21) ధ్వంసం చేశామని, ఇందులో 661.75 కిలోల మెఫెడ్రోన్, 108.251 కిలోల హెరాయిన్ ఉందని సీనియర్ కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు.

ఆరోగ్యకరమైన సమాజం, సుసంపన్నమైన దేశం అనే లక్ష్యాన్ని సాధించడానికి భారత ప్రభుత్వం మాదకద్రవ్యాల పట్ల జీరో టాలరెన్స్ కు పెద్దపీట వేసింది. న్యూఢిల్లీలోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 1,372.205 కిలోల మాదకద్రవ్యాలను నాశనం చేసింది. వీటికి కొనసాగింపుగా, న్యూఢిల్లీలోని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ యొక్క సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో న్యూఢిల్లీలోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ 770 కిలోల ఎన్డిపిఎస్ వస్తువులను నాశనం చేసింది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh