Mammootty: మమ్ముట్టి కి మాతృవియోగం

Mammootty

Mammootty: మాతృవియోగం పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Mammootty: మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో  మెగాస్టార్‌ మమ్ముట్టి  తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) ఈరోజు (ఏప్రిల్‌21) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తన తుదిశ్వాస విడిచారు.ఫాతిమా మరణంతో Mammootty ఫ్యామిలీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఇంకా అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.ఇక కొచ్చిలోని చెంబు ప్రాంతానికి చెందిన ఫాతిమా తన సోదరసోదరిమణులతో కలిసి నివసిస్తోంది. ఆమె అంతిమ సంస్కారాలను చెంబులోని మసీదులోనే నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది.

ఈరోజు సాయంత్రమే అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమ్ముట్టి  తల్లి మరణంతో మలయాళ చిత్రసీమలో చాలా తీవ్ర విషాదం అలుముకుంది. పలువురు సినీ నటులు ఆమె మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మలయాళీ అయినా మమ్ముట్టికి తెలుగు నాట కూడా చాలా మంచి ఫాలోయింగ్‌ ఉంది. స్వాతికిరణం, సూర్య  పుత్రులు ఇంకా దళపతి  వంటి చిత్రాలతో ఆయనకు టాలీవుడ్‌ ప్రేక్షకులతో మంచి అనుభందం అనేది ఏర్పడింది. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న ఏజెంట్ మూవీలోనూ కీ రోల్‌ పోషించాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

ఇక Mammootty కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్‌ గతేడాది ‘సీతారామం’తో సూపర్‌హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కాగా మమ్ముట్టి తల్లి మరణంపై తిరువనంతపురం ఎంపీ శశిథూరూర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ‘ ఈరోజు ఉదయమే మమ్ముట్టితో మాట్లాడాను. ఆయన తల్లిగారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అమ్మలేని లోటు పూడ్చలేనిది. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేలా మమ్ముట్టికి ధైర్యాన్ని అందించాలని కోరుతున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు శశిథరూర్‌.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh