Csk vs mi :రెండో సారి విజయం సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఘన విజయం సాధించింది. భారత వెటరన్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే 27 బంతుల్లో 61 పరుగులు చేయడంతో ఎల్లో ఆర్మీ 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. ఐపీఎల్ 2023 సీజన్లో ముంబయి ఇండియన్స్ అవమానకర ఓటమి ఎదురైంది. సొంతగడ్డ వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని శనివారం రాత్రి ఢీకొన్న ముంబయి టీమ్ ఆ జట్టుకి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో చెలరేగిన చెన్నై టీమ్ 157/8కే ముంబయిని పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయి ఛేదించేసింది. తాజా సీజన్లో మూడో మ్యాచ్ ఆడిన చెన్నైకి ఇది రెండో విజయం ముంబయికి వరుసగా రెండో ఓటమి.
158 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ దేవాన్ కాన్వె (0) ఫస్ట్ ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ నెం.3లో వచ్చిన అజింక్య రహానె బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి దూకుడుగా ఆడేసిన రహానె రెండో వికెట్‌కి కేవలం 7.4 ఓవర్లలోనే 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో రహానె వరుసగా ఒక 6 నాలుగు 4 బాదేశాడు. దాంతో ప్రమాదకరంగా మారిన రహానెని పీయూస్ చావ్లా ఔట్ చేశాడు. కానీ అప్పటికే చెన్నై చేతుల్లోకి మ్యాచ్ వచ్చేసింది. రహానె ఔట్ తర్వాత వచ్చిన శివమ్ దూబె భారీ షాట్లు ఆడేయగా చివర్లో అంబటి వరుస బౌండరీలతో చెన్నై గెలుపు లాంఛనాన్ని 159/3తో పూర్తి చేశాడు. ముంబయి బౌలర్లలో బెరండ్రాఫ్, పీయూస్ చావ్లా, కుమార కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు.
అంతకముందు ముంబయి జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించారు. కానీ ఈ ఇద్దరి ఔట్ తర్వాత అసలు సమస్య మొదలైంది కామెరూన్ గ్రీన్ (12), సూర్యకుమార్ యాదవ్ (1) వరుసగా రెండో మ్యాచ్‌లో ఫెయిలయ్యారు. కానీ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ చివర్లో టిమ్ డేవిడ్ హృతిక్ షూకెన్ బ్యాట్ ఝళిపించడంతో ముంబయి టీమ్ 157 పరుగులైనా చేయగలిగింది. చెన్నై టీమ్‌లో జడేజా మూడు వికెట్లు పడగొట్టగా తుషార్ దేశ్‌పాండే, మిచెల్ శాంట్నర్ చెరో రెండు, మగళ ఒక వికెట్ తీశాడు.
ముఖ్యంగా ఈ రోజు రాత్రి ఎంఐతో జరిగిన మ్యాచ్‌లో (3/20) తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. జడేజా 213 ఐపీఎల్ మ్యాచుల్లో 30.33 సగటుతో 136 వికెట్లు పడగొట్టాడు. అతని ఐపీఎల్ కెరీర్ ఎకానమీ 7.59. 26.10 సగటుతో 2,506 పరుగులు, 127.27 సగటుతో రాణించాడు. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న రోహిత్ ఈ రాత్రి కూడా కష్టపడ్డాడు. 13 బంతుల్లో 21 పరుగులు, 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించాడు. అయితే, భారీ విజయాన్ని అందుకోగలిగాడు. ఎంఐ తరఫున 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), సురేశ్ రైనా (సీఎస్కే) మాత్రమే ఒక జట్టు తరఫున 5 వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు.