మోది వ్యతిరేక పోస్టర్ల – సమర్ధించు కుంటున్న అప్ వర్గాలు

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని వేలాది పోస్టర్లు వెలిశాయి.ఈ పోస్టర్లపై పోలీసులు 44 కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. మంగళవారం జరిగిన భారీ ఆపరేషన్ లో పోలీసులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 వేల పోస్టర్లను తొలగించారు. ఈ పోస్టర్లలో ఎక్కువ భాగం “మోడీ హటావో, దేశ్ బచావో (మోడీని తొలగించండి, దేశాన్ని రక్షించండి)” అనే నినాదం ఉంది.  పోస్టర్లు అతికించినందుకు ఢిల్లీ పోలీసులు 17 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 15 మందిని అరెస్టు చేశారు. ‘మోదీజీ హుమారే బచోన్ కీ వ్యాక్సిన్ విదేశ్ క్యూ భేజ్ దియా (ప్రధాని మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపారు?)’ అని రాసి ఉన్న పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో అతికించారు.

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు, ప్రింటింగ్ ప్రెస్ పేరుతో పోస్టర్లు ఉండాలనే చట్టం ప్రకారం ఈ అరెస్టులు జరిగాయని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ప్రశ్నించగా 50,000 “మోడీ హఠావో, దేశ్ బచావో” పోస్టర్లను ముద్రించాలని తమకు ఆర్డర్ వచ్చిందని ఢిల్లీ పోలీసులకు తెలిపారు. పోస్టర్లలో ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంతో యజమానులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రింటింగ్ ప్రెస్ యాక్ట్, డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరవేస్తున్న సుమారు 2,000 పోస్టర్లను స్వాధీనం చేసుకున్నాట్లు పోలీసులు తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం నుంచి బయలుదేరిన వ్యాన్ను సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో అడ్డుకున్న పోలీసులు ఈ పోస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. అడ్డుకుని ఉన్న వ్యాన్ను  కొందరిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ తెలిపారు. అరెస్టుఐన వారిలో కొందరు సోమవారం కూడా తాను ఇలాంటి సరుకును డెలివరీ చేశానని చెప్పారు . 2021 లో కోవిడ్ -19 కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా నగరంలో ప్రధాని మోడీని విమర్శిస్తూ పోస్టర్లు వేసిన సంఘటన కూడా నమోదైంది.

ఈ ఘటన పై ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా ఎఫ్ఐఆర్లను ప్రశ్నిస్తూ పోస్టర్లలో అభ్యంతరకరంగా ఏముందని ప్రశ్నించింది. ఇది మోడీ ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని ఆ పార్టీ సమర్దించుకుంటుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh