CM Jagan: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ లో ఏపీలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన సంక్షేమ బాట వీడడం లేదు ప్రస్తుతం 2024 ఎన్నికలను టార్గెట్ చేస్తున్న ఆయన ప్రజలకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ ఆసరా పథకంమూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు (శనివారం) ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఇదే సమయంలో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళసీఎం జగన్ ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల వేళ జగన్ కీలక హామీ ఇచ్చారు. అప్పటి వరకు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు విడతలుగా అప్పటి వరకు బ్యాంకుల్లో అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన విధంగా చెల్లింపు ప్రారంభించారు.
ఇప్పటికే రెండు విడతలుగా చెల్లింపు జరిగింది. రేపు మూడో విడత నిధుల విడుదలకు నిర్ణయంచారు. రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చని సీఎం జగన్ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 – 12.35 బహిరంగ సభలో వైయస్ఆర్ ఆసరా ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఏటా 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే విద్యార్థుల కోసం మరిన్న పథకాలు ప్రవేశ పెట్టే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటి వరకే కేవలం బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలకు మాత్రమే నదగు విడుదల చేస్తున్న ఆయన.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్ని పార్టీ పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని, 175 సీట్లు గెలిచి తీరాలని టార్గెట్ పెట్టారు.