ARHAR DAL :హోలి పండుగ రోజు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
హోలి పండుగ రోజు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం దీని వల్ల సామాన్యులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు . మార్కెట్లో కంది పప్పు ధరరోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఈ ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కంది పప్పుపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. కస్టమ్స్ డ్యూటీ 10 శాతం తొలగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇక్కడ ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది కేవలం హోట్ థార్ దాల్‌కు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. ఇతర థార్ దాల్ ప్రొడక్టులపై మాత్రం ఎప్పటి లాగానే 10 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది. థార్ దాల్ ఉత్పత్తి కూడా తక్కువగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే మరోవైపు ధరలు పైకి చేరుతున్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం హోల్ ధార్ దాల్‌పై కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేసింది వ్యవసాయ శాఖా మంత్రి ప్రకారం 2023లో కంది పప్పు సాగు తగ్గొచ్చని తెలుస్తోంది. అలాగే మార్కెట్లో రేట్లు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో మోదీ సర్కార్ కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత నేపథ్యంలో దేశంలోని వ్యాపారులు కంది పప్పు దిగుమతులపై ఎలాంటి దిగుమతి సుంకాలను చెల్లించాల్సిన పని లేదు. దీని వల్ల కంది పప్పు ధరలు కొంత మేర దిగి వచ్చే అవకాశం ఉంటుంది. పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.అలాగే హోలీ తర్వాత ఉగాది పండుగ రాబోతోంది. తర్వాత శ్రీ రామ నవమి పండుగ ఉంది. ఈ విధంగా ప్రభుత్వం కంది పప్పుపై దిగుమతి సుంకాలను తగ్గించడం గమనార్హం. కాగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం వ్యాపారులు వారి వల్ల ఎంత పరిమాణంలో కంది పప్పు ఉందో కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేశంలో బ్లాక్ మార్కెట్‌ను అడ్డు కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల సామాన్యులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు పెంచే పరిస్థితి ఉండదు.
ఇది కూడా చదవండి :