Taapsee Pannu: బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్నుపై కేసు
టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న యాక్ర్టెస్ తాప్సీ పన్ను తనకిచ్చిన క్యారెక్టర్ ను న్యాయం చేసేందుకు శత విధాలా ప్రయత్నించడంలో ఎప్పుడూ ముందుంటారు ఈ సుందరి. హీరో మంచు మనోజ్ నటించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత వచ్చిన ప్రతీ ఛాన్స్ నూ వదులుకోకుండా ఇండస్ట్రీలో కష్టపడుతూ వస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, అశ్లీలతను వ్యాప్తి చేసేలా ప్రవర్తించినందుకు ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చి 14, 2023 న ఒక వీడియోను అప్‌లోడ్ చేసిందని గౌర్ తెలిపారు. ఈ వీడియోలో తాప్సీ అభ్యంతరకర దుస్తులతో పాటు, లక్ష్మీ దేవి లాకెట్ ఉన్న నెక్లెస్ ను ధరించినట్టు బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ తరుణంలోనే తాప్సీ రీసెంట్ గా ఓ ఫ్యాషన్ వీక్ లో పాల్గొని వివాదాల్లో చిక్కుకున్నారు. మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తాప్సీ ర్యాంప్ వాక్‌లో పాల్గొని, అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నారు. ఈ ఫ్యాషన్ షోలో ఆమె రెడ్ డ్రెస్ వేసుకొని, ఓ నెక్లెస్ ధరించారు. అది కూడా లక్ష్మీ దేవి పెండెంట్ ఉన్న హారం. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
అందాన్ని చూపించే క్రమంలో మితిమీరి చేసే కొన్ని ప్రదర్శనలు ఇలా ఇరకాటంలో పడేస్తాయనడానికి ఇదే రుజువు. దీనిపై గత కొన్నిరోజుల నుంచి ట్రోల్స్, మీమ్స్ హల్ చల్ చేస్తుండగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి చెందిన హిందూత్వ సంస్థ హింద్ రక్షక్ సంఘటన్ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందువులను అవమానించేలా, అశ్లీలతను వ్యాప్తి చేసేలా సినీ నటి తాప్సీ పన్ను ప్రదర్శన ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ సందర్భంగా సినీ నటి తాప్పీపై బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్ ఏకలవ్య గౌర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే దీనిపై ఛత్రపుర ఇన్స్పెక్టర్ కపిల్ శర్మ ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. హిందూ రక్షక్ అనే సంస్థను ఏకలవ్య సింగ్ గౌర్ నిర్వహిస్తున్నారు. గతంలో ఏకలవ్య సింగ్ గౌర్ మునావర్ ఫరూఖీపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కమెడియన్ మునావర్ ఫారూఖీని పోలీసులు అరెస్టు చేశారు. ఇది 2021 జనవరి ఒకటవ తేదీన జరిగింది.