Vijay Yesudas: ప్రముఖ సింగర్ ఏసుదాసు ఇంట్లో దొంగతనం ఏం కొట్టేశారో తెలుసా ?
ఈమధ్య కాలంలో ప్రముఖుల ఇళ్లల్లో వరుస దొంగతనాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం వెలుగు చూడగా తాజాగా మరో స్టార్ సింగర్, నటుడి ఇంట్లో దొంగతనం వెలుగు చూసింది. ఆ వివరాలుసినీ తారల ఇళ్లలో వరుసగా బంగారు నగలు, నగదు, వజ్రాల ఆభరణాలు చోరీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పని చేసేవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇక ఐశ్వర్య రజనీకాంత్ తనతో గొడ్డు చాకిరీ చేయించుకుని.. జీతం సరిగా ఇవ్వలేదని.. అందుకే దొంగతనం చేశానని నిందితురాలు చెప్పుకొచ్చింది. ఈ కేసు విచారణ పూర్తి కాకముందే మరో చోరీ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, గాయకుడు, నటడు విజయ్ యేసుదాస్ ఇంట్లో కూడా భారీ దొంగతనం జరిగింది. శుక్రవారం రోజున చోరీ చోటు చేసుకుంది. దీని గురించి విజయ్ యేసుదాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ అసలు వివరాలలోకి వెళ్ళితే
చెన్నై సిటీలోని ఆళ్వార్‌పేటలోని అభిరాంపురం మూడవ వీధిలో ప్రముఖ సింగర్ విజయ్ ఏసుదాస్, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలు పాడి పాపులారిటీ సంపాదించుకున్న సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్. కొన్ని సినిమాలో విలన్‌గా నటించాడు. ప్రముఖ సినీ గాయకుడు ఏసుదాస్ కుమారుడే ఈ సింగర్, నటుడు విజయ్ ఏసుదాస్.
తన ఇంట్లో ఉంచిన 60 సవరన్ల బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు మాయమైనట్లు సింగర్ విజయ్ ఏసుదాస్ భార్య దర్శన చెన్నై సిటీలోని అభిరామపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న ఇంటి లాకర్లో సుమారు 60 సవరన్ బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు ఉన్నాయని, గత నెల 18న నగలు తీసుకునేందుకు వెళ్లగా లాకర్లో ఉంచిన నగలు అలాగే ఉన్నాయని విజయ్ ఏసుదాస్ భార్య దర్శన ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత నెల 18వ తేదీ తరువాత నగలు, వజ్రాల నగలు అదృశ్యమైనాయని, ఆ ఆభరణాల కోసం పలు చోట్ల వెతికినా కనిపించకపోవడంతో సింగర్ విజయ్ ఏసుదాస్ భార్య ఈనెల 31వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే ఇంట్లో పనిచేసే మేనక, సయ్యద్, పెరుమాళ్ లపై అనుమానం ఉందని గాయకుడు విజయ్ ఏసుదాస్ భార్య దర్శన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేసి వేలిముద్రల నిపుణులతో విచారణ చేపట్టారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఆ ఇంటిలోని ముగ్గురు ఉద్యోగులను పిలిపించి విచారిస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు. తమిళ సెలబ్రిటీల ఇళ్లల్లో ఇలా వరుస దొంగతనాలు చోటు చేసుకోవడం.. అది కూడా పని వారే చేతి వాటం చూపడం కలవరపెడుతోంది.