భూపాలపల్లిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీర్ భూపాలపల్లి జిల్లా లో పర్యటించారు. ఈ పర్యటనలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు అనేక నూతన కార్యాలయాలను సైతం ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి జిల్లా పర్యటనలో ఎన్ని కోట్ల రూపాయలతో భూపాలపల్లి జిల్లాను అభివృద్ధి చేయనున్నారు.? ఎన్ని కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు? ఎన్ని నూతన కార్యాలయాలని ప్రారంభించారనే చర్చలు జిల్లా వ్యాప్తంగా సాగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో మొత్తం రూ.297.32 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. వాటిలోరూ కోటి 20 లక్షలతో నిర్మించిన గణపురం తహసిల్దార్ కార్యాలయం, 4 కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. రూ.229 కోట్లతో 994 గృహాలనునిర్మించి సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన రామప్ప కాలనీని కూడా ప్రారంభించారు. అంతేకాకుండా కోటి రూపాయలతో జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేసిన మంత్రి.
అలాగే భూపాలపల్లిలో రూ.33 కోట్ల నిధులతో 544 డబల్ బెడ్ రూమ్స్, రూ.3 కోట్లరూపాయల వ్యయంతోఆర్అండ్ బీకి సంబంధించిన అతిథి గృహాన్ని, 23 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల కమ్యూనిటీ సెంటర్ కూడా ప్రారంభించారు. రూ.14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్స్ మార్కెట్ ను ప్రారంభించడంతో వీధి వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.6.8 కోట్లతోమిషన్ భగీరథ పనులకు కూడా శంకుస్థాపన చేసిన కేటీఆర్ మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనను, నూతన ప్రారంభాలతో భూపాలపల్లి జిల్లాలో మెరుగైన పరిస్థితులు కనబడే అవకాశం ఉంటుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారస్తుల కోసం స్ట్రీట్ వెండర్స్ మార్కెట్ ను ప్రారంభించడంతో వీధి వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :
- గన్నవరంలో చంద్ర బాబు చేసిన కామెంట్లపై ఘాటుగా రియాక్ట్ అయ్యన కొడాలి
- రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత లా పెళ్లి కి ముఖ్య అతిధులుగా రోజా దంపతులు