రేపు ఇళయరాజా కచేరీ ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

hyderabad traffic restrictions

రేపు ఇళయరాజా కచేరీ ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు(ఫిబ్రవరి 26న) ఇళయరాజా హైదరాబాద్ నగరంలో సంగీత కచేరీ నిర్వహించనున్నారు. కచేరీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లించనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నారు ఇళయరాజా గారు . ఆయన కచేరీని దృష్టిలో ఉంచుకుని, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 వరకు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయనున్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్‌కు వచ్చే ట్రాఫిక్ హెచ్‌సీయూ డిపో, ఎస్‌ఎంఆర్ వినయ్, మజిద్‌బండ్ విలేజ్, హెరిటేజ్ జంక్షన్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి సర్కిల్ మీదుగా మళ్లించనున్నారు.

గచ్చిబౌలి సర్కిల్ నుండి లింగంపల్లికి వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి సర్కిల్, బొటానికల్ గార్డెన్,హెరిటేజ్, మజిద్‌బండ్ విలేజ్, SMR వినయ్, HCU డిపో, లింగంపల్లి మీదగా మళ్లిస్తున్నట్టు ప్రకటించారు. రాయదుర్గం నుంచి లింగంపల్లికి వచ్చే ట్రాఫిక్ ఐఐఐటీ వద్ద మళ్లించి, గోపీచంద్  అకాడమీ మీదుగా విప్రో సర్కిల్‌కు మళ్లిస్తున్నట్టు ప్రకటించారు.

అలాగే ఫిబ్రవరి 26న గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లి వైపు, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు భారీ వాహనాలు అనుమతించరు. ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, ఆర్‌ఎంసీలు, వాటర్ ట్యాంకర్లను అనుమతించరు. గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా ప్రత్యక్ష సంగీత కచేరీ సందర్శంగా ఫిబ్రవరి 26న ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని నగర ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రకటించారు.

ఇళయరాజా సంగీత కచేరీకి సుమారుగా లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పోలీసులు ట్రాఫిక్ పర్యవేక్షిస్తున్నారు. అన్నీ మార్గాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు.  ఇళయరాజా హైదరాబాద్ నగరంలో కచేరీ నిర్వహించడం ఇదే మొదటి సారి. దీంతో కనీసం లక్షమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సంగీత ప్రియులతోపాటు, సినీ  రాజీకియా ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీవీఐపీలో హాజరు అయ్యే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి 26న గచ్చిబౌలి ఏరియాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళయరాజా సంగీత కచేరి టికెట్లు కావాల్సిన వారు ముందస్తుగా ఆన్ లైన్‌లో కొనుగోలు చేసుకోవల్సి ఉంది.  అయితే స్టేడియంలోకి అరగంట ముందే చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply