Amit Sha : మార్చి 12న తెలంగాణ కు హోంమంత్రి అమిత్ షా..

Home minister Amit Shah to visit Telangana on March 12th

Amit Sha : మార్చి 12న తెలంగాణ కు హోంమంత్రి అమిత్ షా..

Amit Sha : రానున్న ఎన్నికలలో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

ఇప్పటికే గత నెల 10న నేషనల్‌ పోలీస్‌ అకాడమీ పాసింగ్‌ అవుట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన అమిత్ షా ఇప్పుడు మళ్లీ తెలంగాణకు రాబోతున్నారు.

ఆయన  మార్చి 11 రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు అదే రోజు హైదరాబాద్‌లో కోర్‌ కమిటీతో ఆయన భేటీకానున్నట్లు తెలుస్తోంది. 12న ఉదయం హకీంపేటలో జరిగే అధికారిక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు అనంతరం అదే రోజు బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు హోంమంత్రి అమిత్ షా.

దీనిని రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా భారీగా నిర్వహించేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. సంగారెడ్డిలో జరిగే మేధావుల సమావేశానికి  సుమారు రెండు వేల మంది మేధావులు హాజరవుతారని తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో  హైదరాబాద్‌లో కాకుండా సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంగారెడ్డిలో మేధావులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలపై ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అనంతరం నేరుగా కర్నాటకలోని బీదర్‌కు వెళ్తారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు నెలలపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు హోంమంత్రి .

మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్దేశించిన ప్రాంతాల్లోకి పాస్‌లు ఉన్నవారినే అనుమతించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి :

Leave a Reply