నిన్న వికారాబాద్ నేడు వరంగలలో లీక్ అయిన టెన్త్ క్లాస్స్ పేపర్స్

TENTH EXAMS:నిన్న వికారాబాద్ నేడు వరంగలలో లీక్ అయిన టెన్త్ క్లాస్స్ పేపర్స్

ఇటీవలి కాలంలో పేపర్ లీక్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనంగా మారింది. లీకేజీ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది.

ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్‌ చేసిన ప్రవీణ్‌, రాజశేఖర్‌, పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విచారణ జరుగుతుండగానే.. మరో పేపర్ లీక్ కలకలం రేపింది.

ఇప్పుడు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అవ్వడంతో విద్యార్దుల తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టగా మళ్ళీ  మంగళవారం హిందీ ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభమైన గంటకే వాట్సప్‌లో ప్రత్యక్షం కావడం ప్రకంపనలు రేపుతోంది.

పరీక్ష పేపర్ ముందే లీక్ అయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష ప్రారంభమైన గంటకే హిందీ ప్రశ్నాపత్రం బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వరుస పేపర్ల లీక్ సంఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

మంగళవారం వరంగల్‌లో టెన్త్ హిందీ పేపర్ వాట్సప్‌లో చక్కర్లు కొట్టింది. ఎగ్జామ్ స్టార్ అయిన గంటకే క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. వాట్సప్‌లో ఎవరో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే వరుసగా రెండో రోజు ప్రశ్నాపత్రం లీక్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పేపర్లు పరీక్షకు ముందే లీక్ అవుతున్నాయని కొంతమంది అనుమానిస్తున్నారు. అయితే పేపర్ లీకైనట్లు విద్యాశాఖ అధికారులు ధృవీకరించలేదు.

ఈ విషయాన్ని సీపీ రంగనాథ్ దృష్టికి హనుమకొండ, వరంగల్ డీఈవో ఎండి అబ్దుల్ హై, వాసంతి తీసుకెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్‌పై ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ అధికారులు ఆరా తీస్తున్నారు. స్టూడెంట్ వాట్సప్ గ్రూపుల్లో క్వశ్చర్ పేపర్ లీక్ అయినట్లు సమాచారం.

హిందీ పేపర్ లీక్‌పై సీపీ రంగనాథ్ స్పందించారు. పేపర్ ఎలా లీక్ అయిందనే దానిపై విచారణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఏ సెంటర్ నుంచి లీక్ అయిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని అన్నారు.

ఇతర జిల్లాల వాట్సప్ గ్రూపుల్లోనూ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని, ఎక్కడ నుంచి బయటకు వెళ్లిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ నుంచి బయటకు వెళ్లిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు కాదని, పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్ బయటికి వెళ్తే లీక్ అంటామని తెలిపారు.

అసలు పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత క్వశ్చన్ పేపర్ బటయకు వచ్చినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న లోటుపాట్లపై దృష్టి పెడతామని, పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా చర్యలు చేపడతామని అన్నారు.

పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పేపర్ లీకులకు తెలంగాణ అడ్డాగా మారిందని విమర్శించారు. పేపర్ లీక్‌లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. వీటికి బాధ్యత వహించి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామాా చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh