covid cases in India:దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో మళ్లీ కరోనా వైరస్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి పెరుగుతున్న కరోనా కేసుల మధ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్-19 కేసుల పెరుగుదలపట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. జ్వరం, దగ్గు 5 రోజుల కంటే ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలని అందులో పేర్కొంది.
ఇదే సమయంలో ఫ్లూ కేసులు సైతం రికార్డు స్థాయిలో నమోదుకావడంపై అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వయోజనుల చికిత్సకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. భౌతిక దూరం, ఇండోర్ లోనూ మాస్కులు వాడకం, చేతుల పరిశుభ్రత వంటివి ప్రజలు పాటించాలనీ, కొన్ని పరిస్థితులలో యాంటీబయాటిక్స్ నివారించడం కీలకమని పేర్కొంది. వైరస్, బ్యాక్టీరియా సంక్రమణపై క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ వాడకూడదు. కొవిడ్-19 ఇతర అంటువ్యాధులతో కలిసి సంక్రమించే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైగ్రేడ్ జ్వరం/ తీవ్రమైన దగ్గు, ముఖ్యంగా 5 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అయితే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1590 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
గత 146 రోజుల్లో గరిష్టంగా అంచనా వేశారు. ఓమిక్రాన్ ఉపరకం వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్ధితుల్ని గమనిస్తూ రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తోంది. గత 24 గంటల్లో బయటపడిన 1590 కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 8601కు పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. సోమవారం రాష్ట్రాలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రాష్ట్రాల్ని మరింత అప్రమత్తం చేయబోతున్నారు. ముఖ్యంగా గతంలో కోవిడ్ వేవ్ ల సమయంలో పాటించిన ప్రోటోకాల్ ను తిరిగి అమలు చేయాలని కోరే అవకాశం కూడా ఉంది.అని సమాచారం.