10 EXAM PAPER LEAK : వికారాబాద్ లో టెన్త్ క్లాస్ పేపరూ లీక్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కుదిపేస్తుండగా.. ఇప్పుడు టెన్త్ పేపర్ కూడా లీక్ కావడం కలకలం రేపుతోంది. తెలుగు భాషకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియా, వాట్సాప్ లో ప్రత్యక్షమయ్యింది. దీంతో తెలంగా ణ ప్రభుత్వం షాక్ అయ్యింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కార్ కు.. ఇప్పడు ఇదో తలనొప్పిగా తయారైంది.
అయితే విద్యార్దులు పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఈ లీకులకు అడ్డుకట్ట మాత్రం లేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఓ వైపు పరీక్ష కొనసాగుతుండగా తాజాగా పేపర్ లీకేజ్ కలకలం సృష్టించింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ప్రశ్న పత్రం లీకు కలకలం రేపింది.
నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీక్ వంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా లీక్ వ్యవహారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ (అవ్వడం నేడు కలకలం రేపింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పదవ తరగతి పరీక్ష మొదలు కాగా.. ఏడు నిమిషాల తర్వాత (9.37 నిమిషాలకు) వాట్సాప్లో ప్రశ్నాపత్రం లీక్ అయింది. తాండూరులోని ఓ సెంటర్లో ప్రశ్నాపత్రం లీక్ అయింది. పలు వాట్సాప్ గ్రూపులలో టెన్త్ క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలపై వికారాబాద్ జిల్లా డీఈవో స్పందించారు. తమ జిల్లాలో పేపర్ లీక్ కాలేందటూ వివరణ ఇచ్చారు. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బందెప్ప ఫోన్ నుంచి పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ప్రశ్నాపత్నం లీకేజ్ పై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అయితే ప్రశ్నపత్రం లీక్ వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులో ఆందోళన ఏర్పడింది. ఈ ఘటన గురించి పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.