తనకు కేన్సర్ సోకిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలియనివాళ్ళు ఎవరు వుండరు. అయితే  ఆయన గురించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతేకాదు, దాని ప్రభావం ఆయన అభిమానుల మిద పడుతుంది.  అటువంటిది చిరంజీవికి కేన్సర్ అనే తప్పుడు ప్రచారం జరిగితే ఇంకేముంది. ఆయన అభిమానులు తల్లడిల్లిపోతారు. ఇటీవల చిరు ఒక కేన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ ఆయన చేసిన కామెంట్లను తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు చిరుకు కేన్సర్ సోకిందని, ట్రీట్ మెంట్ తర్వాత ఆయన కోలుకున్నారని రాశారు. దీనిపై గందరగోళం నెలకొంది. దీంతో ఆ వార్తలపై చిరంజీవి వెంటనే ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అంతేకాదు, చిరు ఇచ్చిన క్లారిటీతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

అయితే అసలు వివరాలలోకి వెళ్ళితే ‘కొంతకాలం క్రితం క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించినప్పుడు క్యాన్సర్ పై అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాను. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ ను నివారించవచ్చని చెప్పాను.

నేను అప్రమత్తమై పెద్దప్రేగు స్కోప్ పరీక్ష చేయించుకున్నాను. క్యాన్సర్ లేని పాలిప్స్ ను గుర్తించి తొలగించామని చెప్పాను. ‘నేను మొదట పరీక్ష చేయకపోతే, అది క్యాన్సర్గా మారేది’ అని మాత్రమే చెప్పాడు.

అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని వైద్య పరీక్షలు/స్క్రీనింగ్ చేయించుకోవాలి. అని  మాత్రమే  అన్నాను. ‘ అయితే  కొన్ని  మీడియా సంస్థలు  దీన్ని సరిగ్గా అర్థం  చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో  ‘నేను  క్యాన్సర్  బారిన పడ్డాను’ అని  ‘చికిత్స  వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్  ఆర్టికల్స్ మొదలు  పెట్టాయి. దీని వల్ల అనవసరమైన  కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది  వెల్ విషర్స్  నా ఆరోగ్యం గురించి  మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ  క్లారిఫికేషన్. అలాగే అలాంటి  జర్నలిస్టులకి  ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు  చవాకులు  రాయకండి. దీనివల్ల  అనేక మందిని  భయభ్రాంతుల్ని  చేసి  బాధ పెట్టిన వారవుతారు.

అయితే కేన్సర్ నివారణకు నిర్వహించే అవగాహన కార్యక్రమాల కోసం తన వంతు సహకారాన్ని అందించడానికి వెనుకాడబోనని ఈ సందర్భంగా చిరంజీవి స్పష్టం చేశారు. అయితే, కేన్సర్ అవగాహన కార్యక్రమాలకు చిరు హాజరుకావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎన్నో సార్లు ఆయన కేన్సర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు హాజరయ్యారు.

ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. మెహర్ రమేశ్ ఈ మూవీకి దర్శకుడిగా ఉన్నారు. చిరంజీవి సరసన హీరోయిన్‍గా తమన్నా నటిస్తున్నారు. చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్, క్రియేటివ్స్ కమర్షియల్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం వస్తోంది. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‍గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh