చరిత్ర సృష్టిస్తున్న లోకేష్ పాదయాత్ర

Yuva Galam padayatra:చరిత్ర సృష్టిస్తున్న లోకేష్ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్లినా మహిళలు, అభిమానులు హారతులు పడుతూ స్వాగతాలు పలుకుతున్నారు. ప్రతీ విడిది కేంద్రంలో సెల్ఫీలు దిగుతూ అభిమానులు ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ప్రతీరోజు దాదాపు వెయ్యిమందితో యువనేత సెల్ఫీలు దిగుతున్నారు.ప్రస్తుతం  నారా లోకేష్ యువగళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి రాక ముందే హెచ్చరికలు వినిపించాయి. తన గురించి ఒక్క మాట మాట్లాడినా లోకేష్ బస చేసిన ప్రాంతం వద్దకు వచ్చి కూర్చుంటానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు.

తాడిపత్రి మొత్తం పెద్దారెడ్డి తెచ్చి పెట్టుకున్న పోలీసులు ఉన్నారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన డీఎస్పీ చైతన్య ఉన్నారు. ఆయన కూడా లోకేష్ వద్దకు వచ్చి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయవద్దని సూచించారు.

అలాగే  పాదయాత్రపై ఆంక్షలు పెట్టారు. జనాల్ని నియంత్రించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ పాదయత్ర మరింత జోరుగా సాగడానికే ఉపయోగపడ్డాయి. ఎంత అణిచివేయడానికి ప్రయత్నిస్తే అంతగా ఎగసిపడుతుందన్న నిజం బయటకు తెలిసేలా పాదయాత్ర జరిగింది. తాడిపత్రిలో నిర్వహించిన సభకు వచ్చిన జనంవారు చూపించిన స్ఫూర్తి చూస్తే వైసీపీ నాయకులకు కూడా మైండ్ బ్లాంక్ అవుతుంది. తాడిపత్రిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతకైనా తెగిద్దామని అనుకున్న వైసీపీ చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు.

అలాగే లోకేష్‌ను తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు కలిశారు. తాడిపత్రిలో అధికార పార్టీ, పోలీసులు ఆధ్వర్యంలో జరుగుతున్న దౌర్జన్యాలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుని యువనేతకు మహిళా కౌన్సిలర్లు వివరించారు. డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి వైసీపీ కండువా కప్పుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ల ఆవేదనపై లోకేష్ స్పందిస్తూ ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అన్ని తనకు తెలుసన్నారు. ఎవరిని వదిలిపెట్టనని కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ ధైర్యంగా పోరాడుతున్నారు అంటూ కౌన్సిలర్లను లోకేష్ అభినందించారు.

ఇప్పటి  వరకు జరిగిన నియోజకవర్గాల్లో పాదయాత్ర ఓ ఎత్తు అయితే  తాడిపత్రిలో జరిగిన పాదయాత్ర ఓ ఎత్తు. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర ఇంత హైలో సాగుతుందని టీడీపీ శ్రేణులు కూడా ఊహించలేకపోతున్నారు. పక్కా వ్యూహంతో అందర్నీ కలుస్తూ సాగుతున్న లోకేష్ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ నేతలు నమ్మతుున్నారు.

అయితే రాయలచెరువులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించారు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్ కు రాయలసీమకు డ్రిప్ ఎంత ముఖ్యమో తెలియదా? డ్రిప్ ఎందుకు రద్దు చేశాడు? అంటూ లోకేశ్ ప్రశ్నించాడు. తాము అధికారంలో ఉండగా డ్రిప్ ను సబ్సిడీపై ఇచ్చామని నేడు ఆ ఫలితాలు చూస్తున్నామని ఆయన అన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక డ్రిప్ రద్దు చేయడం వల్ల రైతులు నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దేశంలోనే ఏపీని రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానానికి తెచ్చాడంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh