Virat Kohli :ఐపీఎల్ 2023 లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్
ఐపీఎల్-16లో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ పేరిట ఇదివరకే లెక్కకు మిక్కిలి రికార్డలున్నాయి. తాజాగా ముంబై తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో కోహ్లీ మరో ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు.
కోహ్లీ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 82 పరుగులు చేసి ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించాడు. ఆరంభం నుంచి చురుగ్గా కనిపించిన ఈ మాజీ కెప్టెన్ ముంబై ఇండియన్స్ బౌలర్లను ఏమాత్రం భయపెట్టలేదు. విరాట్ కోహ్లీ అంటేనే రికార్డులు! లేకపోతే ఏంటి మరి.. టీమిండియా తరఫున ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతల్ని సాధించిన ఇతడు.. ఐపీఎల్ లోనూ ఆల్రెడీ కొన్ని రికార్డులు తన పేరిట నమోదు చేశాడు. అయినా సరే ఇంకా దాహం తీరినట్లు లేదు. తాజాగా ప్రారంభమైన కొత్త సీజన్ లోనూ తొలి మ్యాచ్ లోనే సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆర్సీబీని గెలిపించడమే కాదు.. ఆ విషయంలో ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మని వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో కోహ్లీ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
ఐపీఎల్లో 50 ప్లస్ స్కోర్ 50 సార్లు చేసిన ఇండియన్ క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఐపీఎల్లో అత్యధికంగా ఫిఫ్టీస్ కొట్టిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ఫస్ట్ ఉన్నాడు. ఇక కోహ్లీ తర్వాత ఇండియన్లలో రెండవ స్థానంలో ధావన్ ఉన్నాడు. అతను 49 సార్లు ఫిఫ్టీలు కొట్టాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో అతను 82 రన్స్ చేశాడు.
కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ మాత్రం కోహ్లీనే. కోహ్లీ ఐపీఎల్ లో 2008 నుంచి ఒకే టీమ్ (ఆర్సీబీ) కు ఆడుతున్నాడు. మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్ లో 224 మ్యాచ్ లు ఆడి 216 ఇన్నింగ్స్ లలో 6,706 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి.
ఐపీఎల్ లో ఆరు వేల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ కోహ్లీనే. మరో 294 పరుగులు చేస్తే కోహ్లీ 7 వేల పరుగుల క్లబ్ లో చేరతాడు. కోహ్లీ ప్రస్తుతం ఉన్న పామ్ ను చూస్తే ఈ సీజన్ లోనే 7 వేల పరుగుల క్లబ్ లో చేరడం ఖాయమని అనిపిస్తున్నది.