ఏపీ విద్యార్థులకు అల్పాహారంగా రాగి జావా

Good News: ఏపీ విద్యార్థులకు అల్పాహారంగా రాగి జావా

ఏపీ విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  జగన్ మోహన్ రెడ్డి  గారు సంక్షేమంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో పలు మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే నాడు నేడు పేరుతో పాఠశాల రూపు రేఖలు మార్చేశారు. అలాగే అమ్మఒడి విద్యా దేవెన వసతి దీవెన  లాంటి పథకాలు అములు చేస్తూనే ఉన్నారు. తాజా జగనన్న గోరుముద్ద  ద్వారా బడి పిల్లలకు అందించే ఆహారంలో ఫౌష్టికాహారాన్ని అదనంగా కలిపారు. వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆహారం పిల్లలకు ఐరన్‌ కాని, కాల్షియం కాని పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున 450 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ప్రతి ఏటా 1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో 86 కోట్లు కలిపి మొత్తం 1,910 కోట్లు వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సందర్భంగా మాట్లాడిన ఆయన దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక సారి తేడాను గమనిస్తే మొత్తం సంవత్సం అంతా కలిపినా కూడా గతంలో ఏడాదికి కేవలం 450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. ఆయాలకు 8-10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి. సరుకులు కూడా 6-8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిల పెడితే క్వాలిటీ అనేది ఉండదన్నారు.

ఆయితే రాష్ట్రంలో ప్రతి విద్యార్ధిని గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దేందుకు వైసీపీ  ప్రభుత్వం కృషి చేస్తుo  విద్య కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందుందని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కి మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్ట్ ఫోలియో కూడా పెట్టామని. అమ్మ ఒడి ద్వారా బడికి వెళ్లే ప్రతి పిల్లాడి చదువుకు డబ్బులు ఇస్తున్నామని వెల్లడించారు .

అలాగే గర్భవతులైన మహిళల దగ్గరనుంచి చిన్నారుల వరకూ వచ్చే వరకూ సంపూర్ణ పోషణద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. తరువాత ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, ఐఎఫ్‌ఎపీ ప్యానెల్స్‌ ఆరోతరగతినుంచి ఏర్పాటు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం ఇలాంటివి చాలా పథకాలు విద్యార్థులకు అందిస్తున్నామన్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh