AP Ration- :ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్ ఇంటింటికీ రేషన్ పంపిణీకి బ్రేక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను చెరవేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బియ్యం, వస్తువులను ఇంటికి తీసుకెళ్లేందుకు మినీ ట్రక్కులను కొనుగోలు చేయడం ద్వారా లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ప్రత్యేక హోమ్ డెలివరీ వాహనాలను ట్రక్కులను పొందడానికి జిల్లా వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి విషయం తెలిసిందే.
నిత్యావసర సరుకులు ఇంటింటికీ పంపిణీ చేయడానికి మొత్తం 9260 మొబైల్ యూనిట్లు అదే సంఖ్యలో తూకం యంత్రాలను, 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు కూడా సిద్దం చేశారు. 9260 మొబైల్ యూనిట్లలో 3,800 మంది బీసీలు, 1,800 మంది ఇబిసిలు, 2,300 మంది ఎస్సీలు, 700 మంది ఎస్టీలు, 556 మంది ముస్లిం మైనారిటీలు, 104 మంది క్రైస్తవ మైనారిటీలు కలిగి ఉన్నారు. ఈ వాహనాలు కొనుగోలులో లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ లభించగా 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటా ఉండనుంది అవి వైయస్ ప్రభత్వం హామీ ఇచ్చింది.
కానీ ఇప్పుడు ప్రతి నెల ఇంటింటికీ చేరే రేషన్ బియ్యం ఇకపై వస్తాయా అంటే కాదనే వినిపిస్తోంది. జగనన్న అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ పంపిణీకి ఇకపై బ్రేకులు పడనున్నాయి అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్…అసలు వివరాల్లోకి వెళితే ప్రతి నెల ఇంటింటికీ రేషన్ వాహనాల భీమా మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తామే చెల్లిస్తాము అన్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకు ఆఫ్ బరోడా మాత్రం వాహన దారులనే బాధ్యులని అంటున్నారు.
అంతేకాదు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నుండి ఏకంగా ఒక్కొక్కరి వద్ద నుండి రూ.18వేల నుంచి రూ.23వేల కట్ చేసేసింది ఇలా అయితే ఇకపై తాము వాహనాలు తిప్పలేమని అంటున్నారు. ఈ విషయం పై వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్య ను పరిష్కరించి ఆదుకోవాలని అంటున్నారు. లేదంటే ఇకపై వారు రేషన్ వాహనాలు నడపలేమని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.