అసెంబ్లీకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Chandrababu: అసెంబ్లీకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తరువాత అసెంబ్లీకి వచ్చారు. కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బహిష్కరించారు. తిరిగి సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసారు.

ఎప్పుడు ఎలా వ్యవహరించాలో దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికను అటు సీఎం జగన్ – టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అసెంబ్లీకి  వచ్చారు ఒక్క ఓటు దూరంలో టీడీపీ

ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రాంగణలో మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనున్నారు. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు.

తొలుత వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేయటంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమని అందరూ భావించారు.  అయితే సడన్ గా చంద్రబాబు వ్యూహం మార్చారు. పార్టీ నుంచి పంచుమర్తి అనురాధను ఎన్నికల బరిలో దించారు. ఏడుగురు అభ్యర్దులు గెలవాలంటే ఒక్కోక్కరికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందులో భాగంగా వైసీపీకి మొత్తం  154 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిగ్గా సరిపోతోంది. టీడీపీకి 21 మంది మద్దతు కనిపిస్తోంది. ఒక్క ఓటు పెంచుకొనేందుకు టీడీపీ చివరి వరకు ప్రయత్నించింది.

వైసీపీ ఎన్నికల నోటిఫికేషన్ సమయం నుంచి ఏడు స్థానాలు తమకే దక్కుతాయనే ధీమాతో ఉంది. వైసీపీ బలం సభలో 151గా ఉంది. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు, జనసేన ఎమ్మెల్యే వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతోవైసీపీ బలం 156కి చేరింది. ఇద్దరు ఆనం..కోటంరెడ్డి దూరం అయ్యారు. ఈ లెక్కలతో ప్రస్తుతం వైసీపీ బలం 154గా ఉంది. ఇదే ఎప్పుడు ఏడుగురు అభ్యర్దులు గెలవటానికి కావాల్సిన నెంబర్. అదే సమయంలో టీడీపీ నుంచి 23 సంఖ్య బలం ఉండగా..నలుగురు వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీ నుంచి ఇద్దరు టీడీపీకి మద్దతుగా కనిపిస్తున్నారు. దీంతో టీడీపీ బలం 21గా ఉంది. మరో ఓటు కలిసి వస్తే టీడీపీ అనుకన్నట్లుగా వైసీపీకి షాక్ ఇవ్వగలుగుతుంది.

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఏడుగురు అభ్యర్థులను గెలిపించుకోగలదా, లేక మొన్న పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో మాదిరి టీడీపీ మరోసారి వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి ఫలితాన్ని అందుకుంటుందా అన్నది మార్చి 23 గురువారం సాయంత్రం తెలుస్తుంది.

సమావేశాలను చంద్రబాబు బహిష్కరించిన తరువాత చివరి సారిగా రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం రానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో ప్రస్తుతం చంద్రబాబు సమావేశం అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు ఫలితం ఎలా ఉన్నాఅధికార పక్షానికి చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టేటమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది.

అనూహ్యంగా ద్వితీయ ప్రాధాన్యత ఓటు గురించి చర్చ తీసుకొస్తున్నారు. కానీ, ప్రస్తుతం అభ్యర్దుల లెక్కలతో ప్రాధాన్యత అంశం వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈ మేరకు నాలుగు రోజులుగా రెండు పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు రకాలు ప్రచారాలు తెర పైకి వచ్చాయి. నేడు జరుగుతున్న ఎన్నికలో రెబల్స్ ఓటింగ్ కీలకంగా మారనుంది.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh