RATION CARD: రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పిన కేంద్రం
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు శుభవార్త. మీకు కేంద్రం తీపికబురు అందించింది. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే గడువును మార్చి 31 నుంచి జూన్ 30,2023కి పొడిగీసు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో రేషన్ కార్డు కలిగిన వారికి భారీ ఊరట కలిగించింది.
దీని వల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట లభిస్తుందని చె ప్పుకోవచ్చు. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఇంకా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే రేషన్ కార్డు చెల్లుబాటు కాకపోవచ్చు. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి సాధారణంగా మార్చి 31తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఈ డెడ్‌లైన్‌ను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. అంటే మూడు నెలల గడువు పొడిగించింది.
అయితే ఈ పొడిగింపుపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్పీడీ) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యవసర వస్తువుల్ని రేషన్ కార్డు ద్వారా సబ్సీడీగా పొందవచ్చు. దీంతో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ ఎలా గుర్తింపు కార్డ్‌గా వినియోగించుకుంటామో.. ఈ రేషన్ కార్డ్‌ను అలాగే ఉపయోగించుకునేందుకు వీలుంది.
అయితే దేశంలో నిజమైన రేషన్ కార్డ్ లబ్ధి దారుల్ని గుర్తించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్‌లు ఉంటే వాటిని రద్దు చేయడం, ఎక్కువ ఆదాయం అర్జిస్తూ రేషన్ కార్డు వినియోగిస్తుంటే ఆ రేషన్ కార్డ్‌లను క్యాన్సిల్ చేయనుంది. నిజమైన లబ్ధిదారులకు నిత్యవసర వస్తువుల్ని అందించనుంది.
అయితే రేషన్ కార్డ్‌కు ఆధార్ లింక్ ఇలా చేయండిముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో ఆధార్ కార్డ్ నెంబర్,రేషన్ కార్డ్ నెంబర్ తో పాటు ఫోన్ నెంబర్ వంటి వివరాల్ని నమోదు చేయాలి. అనంతరం కంటిన్యూ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్‌కు ఆధార్ లింక్ అవుతుంది. ఆఫ్‌లైన్‌లో రేషన్ కార్డ్ – ఆధార్ లింక్ ఇలా చేయండి
కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, రేషన్ కార్డ్ జిరాక్స్‌లు, బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో రేషన్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఆధార్ కార్డ్ డేటా బేస్‌లో మీ వివరాలని గుర్తించేలా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి. ఆధార్ డేటా బేస్‌లో ఉన్న మీ వివరాలు మ్యాచ్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది. అనంతరం రేషన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేస్తారు