పాడి కౌశిక్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్

ఈసారి ఏదేమైనా హుజురాబాద్ లో గెలిచి తీరాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు పావులు కదుపుతుంది. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టూరిజం శాఖ బాధ్యతలు అప్పగించి పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసినట్టు అర్ధమవుతుంది. ఇందులో భాగంగా హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంఛార్జిగా పాడి కౌశిక్ రెడ్డి ని నియమిస్తున్నట్టు ఆ పార్టీ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది. హుజురాబాద్ లో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ వంటి బలమైన నేత ఉన్న కారణంగా అతనికి సరైన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని భావించిన పార్టీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ విషయంలో ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అనే ఫార్ములాను బీఆర్ఎస్ పాటించినట్లు తెలుస్తుంది.

అయితే నిజానికి హుజురాబాద్ స్థానం అధికార బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అక్కడ నుంచి ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీతో విభేదించిన ఈటల రాజేందర్ 2021లో ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన ఉప ఎన్నికలకు వెళ్లారు.

హుజురాబాద్ ఉపఎన్నికల వేళ విద్యార్థి నాయకుడిగా పేరున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి కూడా పార్టీ గెలుపు కోసం పని చేశారు. ఆ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ 23 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే పార్టీ తరపున బరిలో నిలిచిన గెల్లు ఈటల చేతిలోఘోర  ఓటమిపాలయ్యారు. అప్పట్నుంచి నియోజకవర్గం ఇంఛార్జ్ గా గెల్లు శ్రీనివాసే ఉన్నారు. తాజాగా ఆయనకు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు కేసీఆర్. ఇంతలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు గులాబీ బాస్. నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి గెల్లును తప్పించారు. ఎమ్మెల్సీ అయిన పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ఇక ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా నియోజవర్గంలో అసంతృప్తి చెలరేగకుండా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టి సంతృప్తి పరిచారు. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేస్తూ ఆయన్ను నియోజవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. అయితే పాడి కౌశిక్ రెడ్డిని ఎన్నికల నాటికి టికెట్ కేటాయిస్తారా? లేక గెల్లు శ్రీనివాస్ కూడా టికెట్ కోసం పోటీ పడతారా ? ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరూ పోటీ చేసినా ఈటల రాజేందర్‌ను ఢీకొట్టి నిలబడతారా ? అనేది వేచి చూడాలి.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh