ఐపీఎల్ 2023 శ్రేయస్ అయ్యర్ దూరం కొత్త కెప్టెన్ ఎవరంటే ?

ఐపీఎల్ 2023 శ్రేయస్ అయ్యర్ దూరం కొత్త కెప్టెన్ ఎవరంటే ?

మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 కూడా అయ్యర్ దూరమయ్యే అవకాశాలున్నాయని తెలిస్తుంది  ఢిల్లీ క్యాపిటల్స్ తరహాలోనే తమ కెప్టెన్ సేవలను ఆ జట్టు కోల్పోనుంది. వెన్ను గాయం తిరగబెట్టడంతో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్‌లో బ్యాటింగ్‌కు రాని శ్రేయస్ అయ్యర్.. చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కనీసం IPL 2023 మొదటి అర్ధభాగానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అయ్యర్ ప్రస్తుతం రిపీటెడ్ లోయర్ బ్యాక్ పెయిన్ (నడుం నొప్పి) తో బాధపడుతున్నారు. దీంతో అయ్యర్ కు తాజాగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు అయ్యర్ కు సూచించారు. దీంతో ఇప్పటికే ఆస్ట్రేలియాతో చివరి టెస్టుతో పాటు వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ పర్యవేక్షణలో అయ్యర్ కోలుకోవాల్సి ఉంది.

అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చికిత్స తీసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడని అయ్యర్.  ఢిల్లీ టెస్ట్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో విఫలమైన అయ్యర్.. ఇండోర్ టెస్ట్‌లో పర్వాలేదనిపించాడు. ఇక అహ్మదాబాద్ టెస్ట్‌లో గాయం తిరగబెట్టడంతో బ్యాటింగ్‌కు రాలేదు. అయ్యర్ గాయం తీవ్రత నేపథ్యంలో ఆసీస్‌తో వన్డే సిరీస్ నుంచి అతన్ని బీసీసీఐ తప్పించింది అన్న విషయం తెలిసిందే . ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్‌లు గాయాలతో భారత జట్టుతో పాటు ఐపీఎల్ దూరమైన విషయం తెలిసిందే.

ఆపరేషన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ తిరిగి ఐపీఎల్ ప్రథమార్దంలో జట్టుతో పాటు చేరతాడని యాజమాన్యం భావించింది. అయితే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో అయ్యర్ ఐపీఎల్ ప్రథమార్ధానికి దూరమైనట్లే భావిస్తున్నా రు. మరోవైపు అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్ కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై యాజమాన్యం చర్చలు జరుపుతోంది. అయ్యర్ స్ధానంలో కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా బాధ్యతలు నిర్వహించే ఆటగాడి ఎంపికలో కేకేఆర్ టీమ్ కు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.

గత సీజన్ లో రూ.12.25 కోట్లకు అయ్యర్ ను కొనుగోలు చేసిన కేకేఆర్ కు ఈ సీజన్ లో అతను గాయంతో దూరం కావడం పెద్ద మైనస్ గా మారబోతోంది. అయితే అయ్యర్ స్ధానాన్ని భర్తీచేసేందుకు యాజమాన్యం మొత్తం మూడు ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. తాజాగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న నరైన్ ను కెప్టెన్ గా కేకేఆర్ పరిశీలిస్తోంది. గతంలో ILT20లో అబుదాబి నైట్ రైడర్స్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వంటి జట్లకు కెప్టెన్ గా పనిచేసిన చరిత్ర నరైన్ ఉంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh