సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లవ్, యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో ఆసక్తికరంగా సాగింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్‌ని సమపాళ్లలో మేళవించినట్లు కనిపిస్తోంది. సికందర్ పాత్రలో సల్మాన్ ఖాన్ శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ స్క్రీన్‌పై అదరగొట్టాడు. అలాగే రష్మిక మందన్నతో అతని కెమిస్ట్రీ కూడా హైలైట్‌గా నిలుస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న గ్రాండ్‌గా విడుదల కానుంది.
#SikandarTrailer OUT NOW🔥 https://t.co/XYA07aKPQb #Sikandar releases in theatres near you on 30th March 2025 #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna…— Salman Khan (@BeingSalmanKhan) March 23, 2025
ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ నుంచి వస్తున్న చిత్రమిది కావడంతో, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే సల్మాన్ మళ్లీ తన మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్టైలిష్ యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, గ్రిప్పింగ్ నేరేషన్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా ‘‘అతడిని ఎవడూ ఆపలేడు.. తనకు తప్ప!’’ అనే డైలాగ్ ప్రేక్షకుల గూస్‌బంప్స్‌కు కారణమైంది.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ లీడ్ రోల్ పోషిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా మెరవనుంది. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కిషోర్, శర్మన్ జోషి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ‘గజిని’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించడంతో, ఈ సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రానికి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటంతో, బాక్సాఫీస్‌పై రికార్డులు తిరగరాయడానికి ‘సికందర్’ సిద్ధంగా ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరి సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబో నుంచి వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలా ఉండబోతుందో చూడాలి!