మహేశ్‌బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వస్తున్న తాజా సినిమాకు అధికారికంగా టైటిల్ ఖరారు చేశారు. మూవీకి “ఆంధ్రా కింగ్ తాలుకా” అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
రామ్ పోతినేని – భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే డైలాగ్‌తో వీడియో స్టార్ట్ అవుతూ, రామ్ పాత్రకు ఓ మాస్ వేషం దక్కనుందని స్పష్టమవుతోంది.
FAANNNSSSS!! ❤️🔥https://t.co/nbOKe5hdC6 #RAPO22 is #AndhraKingTaluka pic.twitter.com/Hk09kHzMN8
— RAm POthineni (@ramsayz) May 15, 2025
ఉపేంద్ర ఫ్యాన్‌గా రామ్..
వీడియోలో రామ్ థియేటర్‌లో ఓ హీరో సినిమా టికెట్ల కోసం ప్రయత్నిస్తూ కనిపిస్తాడు. ఎమ్ఎల్ఏలు, పోలీసులు కూడా టికెట్లు తీసుకుంటుంటారు. చివరికి “ఆంధ్రా కింగ్ తాలుకా” అంటూ 50 టికెట్లు అడిగే సీన్ గ్లింప్స్‌ను హైలైట్ చేసింది. అయితే.. గమనించదగ్గ విషయం ఏమిటంటే – రామ్ ఫ్యాన్‌గా కనిపించే హీరో ఉపేంద్ర. ఒక తెలుగు హీరోని ఉంచితే వివాదాలు రావొచ్చని భావించి, నెగటివ్ రియాక్షన్లకు దూరంగా ఉండేందుకు ఉపేంద్రను ఎంచుకున్నట్టు టాక్.
After years of serious roles, Ram Pothineni is back to his entertaining best with Andhra King Taluka!
This film is a celebration of fun and emotion that every Telugu cinema fan, no matter who your favorite hero is, can connect with.#RAPO22 #AndhraKingTaluka pic.twitter.com/ZtxqhXy16s
— Movies4u Official (@Movies4u_Officl) May 15, 2025
మొత్తానికి.. టైటిల్ గ్లింప్స్‌తోనే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. రామ్ మాస్ లుక్, డైలాగ్ డెలివరీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.