భారత యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్లో మరో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్‌ల్లో 52.86 సగటుతో 1903 పరుగులు సాధించిన జైస్వాల్.. ఇంకా 97 పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు సాధించిన భారత బ్యాట్స్మన్లలో ఒకడిగా నిలవనున్నాడు.
ఈ కేటగిరీలో ఇప్పటి వరకు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఉన్నారు. వీరిద్దరూ 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నారు. ద్రవిడ్ 1999లో న్యూజిలాండ్‌పై, సెహ్వాగ్ 2004లో ఆస్ట్రేలియాపై ఈ మైలురాయిని చేరుకున్నారు.
View this post on Instagram
2023 జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన జైస్వాల్.. అప్పటి నుంచి అద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయడం ద్వారా రికార్డు దిశగా పటిష్టంగా అడుగులు వేశాడు.
జూలై 2 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో జైస్వాల్ ఈ మైలురాయిని చేరుతాడా? అనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.