భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ టీ20, టెస్టుల నుంచి రిటైర్ అయినప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఆల్‌టైమ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ అప్‌డేట్ ప్రకారం టీ20 రేటింగ్ 897 నుంచి 909 పాయింట్లకు పెరగడంతో ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఎవరికీ దక్కని రికార్డు.
Number of players with 900+ rating points in ICC Rankings:
In Tests – 5️⃣7️⃣ players
In ODIs – 1️⃣4️⃣ players
In T20Is – 5️⃣ players
All formats – 𝐕𝚰𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝚰 #ViratKohli #CricketTwitter pic.twitter.com/BZHzEBiIbJ— InsideSport (@InsideSportIND) July 16, 2025
విరాట్ కోహ్లీ సాధించిన రేటింగ్ పాయింట్లు:
టెస్టులు: 937 పాయింట్లు (2018లో)
వన్డేలు: 911 పాయింట్లు (2018లో)
టీ20లు: 909 పాయింట్లు
గతేడాది ICC టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న అనంతరం కోహ్లీ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరపున 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4,188 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 122*.
ఇక టెస్టుల నుంచి ఇటీవలే రిటైర్ అయిన కోహ్లీ, భారత్ తరపున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించి, 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 254*. ఆల్‌టైమ్ టెస్ట్ రన్‌స్కోరర్స్ జాబితాలో 19వ స్థానంలో నిలిచాడు.