Surya Kumar Yadav: టీ20లో చరిత్ర సృష్టించిన సూర్య కుమార్ యాదవ్..!

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా 14 ఇన్నింగ్స్‌ల్లో 25కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా పేరిట ఉండేది. ఆయన వరుసగా 13 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించారు.

కేవలం రికార్డు బ్రేక్ చేయడమే కాకుండా, సూర్య కుమార్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తన అద్భుత ప్రదర్శనతో 600 పరుగుల మార్క్‌ను కూడా దాటేశాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఆయన చేసిన పరుగులు ముంబై ఇండియన్స్ విజయాలకు కీలకం అయ్యాయి.

ముంబై జట్టు చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఒకసారి మాత్రమే 618 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును సూర్య కుమార్ యాదవ్ అధికమించాడు. ఈ నేపథ్యంలో ముంబై ప్లేఆఫ్స్‌కి చేరినా, మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై వారి భవిష్యత్ ఆధారపడి ఉంది.

ఇక జైపూర్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.

Leave a Reply