ఐపీఎల్ 2025లో టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్, ఊహించని విధంగా వరుసగా ఓటములతో వెనుకబడిపోయింది. గత సీజన్‌లో సూపర్ ఫామ్ తో ఫైనల్‌కు చేరినా.. తుదిలో కోల్‌కతా చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం టైటిల్ దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రయాణం మొదలుపెట్టింది ఎస్‌ఆర్‌హెచ్.
ఈ సీజన్‌ను దుమ్ము దులిపే స్థాయిలో స్టార్ట్ చేసిన సన్‌రైజర్స్, మొదటి మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్‌ను 286 పరుగుల భారీ స్కోరు చేసి చిత్తు చేసింది. అప్పుడు ఫ్యాన్స్ “ఈసారి ఎస్ఆర్‌హెచ్ 300 రన్స్ మార్క్‌ను సులువుగా కొడుతుంది” అని ఆశించారు. కానీ ఆ తర్వాత కథే మారిపోయింది.
తరువాతి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలై నేరుగా పాయింట్ల పట్టికలో చివరికి వెళ్లిపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ ఒక్క గెలుపుతో రెండు పాయింట్లు మాత్రమే ఖాతాలో వేసుకోగలిగింది. నెట్ రన్‌రేట్ కూడా -1.612గా ఉంది.
— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025
ఈ సీజన్‌లో ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గత సీజన్ల లెక్కల ప్రకారం ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కనీసం 8 గెలుపులు అవసరం. అంటే మిగతా 10 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ కనీసం 7 మ్యాచుల్ని గెలవాల్సిందే. ఈ ఫామ్‌తో చూస్తే ఇది కొంచెం కష్టమే అని అర్థమవుతుంది.
మొదటి మ్యాచ్‌లో దుమ్మురేపిన బ్యాటర్లు తర్వాత మ్యాచులలో మాత్రం అదే స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ త్వరగా అవుటవుతూ జట్టు కష్టాల్లో పడేసారు. పిచ్ పరిస్థితులు ఏవైనా కావొచ్చు కానీ జట్టు దృష్టి ఒక్కటే – దూకుడైన బ్యాటింగ్. అయితే అదే ఆలోచన ఇప్పుడు వారిని గజిబిజి చేసింది.
ఐపీఎల్ సీజన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటికైనా మేల్కొని పునరాగమనం చేస్తే ప్లేఆఫ్స్ రేసులో పోటీ ఇవ్వగలదు. లేకపోతే మిగతా మ్యాచులు కూడా ఓటములతో ముగిస్తే ఈ సీజన్ కథ అంతే. ఫ్యాన్స్ ఆశలు నెరవేరాలంటే జట్టు త్వరగా రిబౌన్స్ అవ్వాల్సిందే!