టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ప్రేమాయణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ధృవీకరించినప్పటికీ, ప్రేమలో ఉన్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే, “ఆమె ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి” అంటూ ప్రశంసించారు.
శిఖర్ ధావన్ ప్రముఖ జర్నలిస్ట్ నావికా కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన ప్రేమ జీవితం గురించి మాట్లాడారు. ఈ మధ్యకాలంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓ యువతితో కలిసి కనిపించిన ధావన్, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.
View this post on Instagram
ఆమె ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్..?
ధావన్ ప్రేయసి ఎవరు అనే విషయంలో నెటిజన్లకు ఆత్రుత పెరిగింది. ఆమె ఐర్లాండ్‌కు చెందిన మోడల్ సోఫీ షైన్ కావచ్చని పుకార్లు ఉన్నాయి. అయితే, ధావన్ ఆమె పేరు చెప్పకపోయినా, తన గర్ల్‌ఫ్రెండ్‌నే అని పరోక్షంగా ఒప్పుకున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇదే మొదటిసారి కాదు, 2024 నవంబర్‌లో కూడా ధావన్, సోఫీ షైన్ ఇద్దరూ ఒక విమానాశ్రయంలో కలిసి కనిపించడంతో, వీరి డేటింగ్‌పై మరింత చర్చ మొదలైంది.
అయేషా ముఖర్జీతో పెళ్లి – విడాకులు
39 ఏళ్ల ధావన్ 2023 అక్టోబర్‌లో తన మాజీ భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నారు. ఆయేషా ముఖర్జీతో ధావన్ వివాహం 2012లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
ఆయేషా ముఖర్జీకి ఇది రెండవ వివాహం. ఆమె మొదటి భర్త ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్త. మొదటి వివాహానికి ముగింపు అనంతరం ధావన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట 2023లో విడిపోయింది.
ధావన్ ప్రేమాయణంపై నెటిజన్ల ఆసక్తి
తాజా ఇంటర్వ్యూలో ధావన్ తన ప్రేమలో ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంతో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ధావన్ తన ప్రేయసి పేరు ప్రకటించకపోయినా, సోఫీ షైన్‌గానే భావిస్తున్నారు. మరి ఈ రూమర్స్ నిజమా? లేక ఇంకెవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారా? అనేది చూడాలి!