క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చాలా సైలెంట్‌గా ఇరు కుటుంబాల మధ్య జరిగిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి నిశ్చయం అయ్యింది.
సచిన్ టెండూల్కర్ పుత్రరత్నం అర్జున్ టెండూల్కర్ తన తండ్రి వారసత్వాన్ని తీసుకున్నప్పటికీ, క్రికెట్ కెరీర్లో పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. అర్జున్ టెండూల్కర్ బౌలర్‌గా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు భారత జట్టుకు ఆడలేదు. ఐపీఎల్లో ముంబై జట్టుకు చెందినప్పటికీ, అన్ని మ్యాచ్‌లలో అటెండ్ కాలేదు. ముంబై జట్టు యజమాని నీతా అంబానీతో సచిన్ బాగా క్లోజ్ కాబట్టి అతను జట్టులో కొనసాగుతున్నాడు.
తాజాగా, అర్జున్ టెండూల్కర్ మరియు సానియా చందోక్ మధ్య నిశ్చితార్థం సైలెంట్‌గా జరిగింది. ఘాయ్ కుటుంబం ముంబైలో చాలా ప్రసిద్ధ వ్యాపార కుటుంబం. వీరి వ్యాపారాల్లో ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ – తక్కువ కేలరీల ఐస్ క్రీమ్ బ్రాండ్ కూడా ఉన్నాయి.
క్రికెట్ రికార్డులు:
ఫస్ట్ క్లాస్: 17 మ్యాచ్‌లు, 37 వికెట్లు, 532 పరుగులు (33.51 సగటు)
లిస్ట్-ఎ: 18 మ్యాచ్‌లు, 25 వికెట్లు, 102 పరుగులు (సగటు 31.2)
టీ20: 24 మ్యాచ్‌లు, 27 వికెట్లు, 119 పరుగులు (సగటు 25.07)
ముంబై జట్టు అతనిని 30 లక్షల రూపాయల బేస్ ధరతో కొనుగోలు చేసింది. కానీ గత సీజన్లో అతను ఎక్కువగా బెంచ్‌కు పరిమితం అయ్యాడు.
అర్జున్ టెండూల్కర్ పెళ్లి వార్తతో సచిన్ కొడుకు మరోసారి మీడియా దృష్టిలోకి వచ్చాడు.
