Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్? వన్డే బాధ్యతలు గిల్‌కి అప్పగించే సూచనలు!

రోహిత్ శర్మకు బీసీసీఐ షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ ప్రస్తుతం వన్డే కెప్టెన్‌గా కొనసాగుతున్నా, త్వరలో ఆ బాధ్యతలు కూడా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రోహిత్ స్థానంలో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించేందుకు బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి.

గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించే అవకాశం శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ నుంచే ఉండే అవకాశముందని ప్రచారం సాగుతోంది. రోహిత్ శర్మతో బీసీసీఐ ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గిల్ బ్యాటింగ్‌లో కనబరుస్తున్న స్థిరత, వన్డేల్లో అతని నంబర్ వన్ ర్యాంక్, టెస్ట్ కెప్టెన్‌గా మంచి ఆరంభం.. ఇవన్నీ ఈ నిర్ణయానికి కారణమవుతాయని భావిస్తున్నారు.

ఇప్పటికే గిల్ భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఈ బాధ్యతలు అతనికి అప్పగించారు. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ యువ నాయకత్వానికి అవకాశమివ్వాలనే యోచనలో ఉంది. ఇక రోహిత్, కోహ్లీలతో కలిసి వన్డేలు ఇంకా కొనసాగాలనే అభిప్రాయం ఉన్నా… వారిద్దరూ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్‌లో మళ్లీ అడుగుపెట్టాల్సి ఉంది. అయితే బీసీసీఐ-బీసీబీ పరస్పర అంగీకారంతో ఆ సిరీస్‌ను వచ్చే ఏడాది వరకు వాయిదా వేశారు.

ఇందువల్లే రోహిత్ వన్డే కెప్టెన్సీ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. త్వరలో శుభ్‌మాన్ గిల్‌కి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించనున్నట్లు ఉన్న సూచనలు ఇప్పుడు టీమ్ ఇండియా ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతున్నాయి.

Leave a Reply