Ravichandran Ashwin: స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ ఐపీఎల్‌కు రిటైర్మెంట్

స్టార్ క్రికెటర్‌, భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన అశ్విన్‌, పంజాబ్‌, ఢిల్లీ‌, రాజస్థాన్‌, పూణెలకు కూడా ప్రాతినిధ్యం వహించారు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ – “ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి దారి తీస్తుంది. ఐపీఎల్‌ క్రికెటర్‌గా నా ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది” అని తెలిపారు.

అశ్విన్‌ ఐపీఎల్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసుకోవడంతో పాటు బ్యాటింగ్‌లో 3503 పరుగులు సాధించారు. ఇందులో 6 సెంచరీలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 116 మ్యాచుల్లో 156 వికెట్లు, టీ20ల్లో 65 మ్యాచుల్లో 72 వికెట్లు తీశారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అనేక విషయాలు బయట పెట్టారు. అయితే వాటిపై ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్లకు అశ్విన్‌‌ను దక్కించుకుంది. అయితే, 2025 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లు మాత్రమే తీసి 33 పరుగులు చేశాడు.

Leave a Reply