రషీద్ ఖాన్ తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ ఆఫ్గన్ స్పిన్నర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రత్యర్థి ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను 7వ ఓవర్‌లో అవుట్ చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాళ్ల జాబితాలో లసిత్ మలింగ, యుజ్వేంద్ర చాహల్ తర్వాత మూడవ స్థానాన్ని రషీద్ ఖాన్ ఆక్రమించాడు. మలింగ 105 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకోగా, చాహల్ 118 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇక రషీద్ 122 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. రషీద్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 124 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు సాధించాడు. అలాగే, డ్వేన్ బ్రావో 137 మ్యాచ్‌ల్లో, భువనేశ్వర్ కుమార్ 138 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించారు.
🚨 MILESTONE ALERT 🚨
Rashid Khan completed 1️⃣5️⃣0️⃣ wickets in TATA IPL!@gujarat_titans @IPL #RashidKhan #TATAIPL2025 #GujaratTitans pic.twitter.com/Sfsaf7QACT
— the_cricket_web (@the_cricket_web) March 25, 2025
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్ 205 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా, రషీద్ ఖాన్ ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో మరిన్ని వికెట్లు తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో రషీద్ ఖాన్ తన ర్యాంక్ మెరుగుపరచుకునే అవకాశముంది.
మ్యాచ్ విషయానికి వస్తే, అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. భారీ స్కోరు ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగుల వద్ద నిలిచిపోయింది. సాయి సుదర్శన్ (74), బట్లర్ (54) పరుగులు చేసి పోరాడినప్పటికీ, చివర్లో పరుగుల భారంతో ఒత్తిడికి గురై విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ సీజన్‌లో అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసే దిశగా కసరత్తు చేయనుంది. ఇక రషీద్ ఖాన్ రాబోయే మ్యాచుల్లో కూడా అదరగొట్టే బౌలింగ్ చేస్తాడా? మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడా? అన్నది చూడాల్సి ఉంది.