IPL 2025: చాహల్‌ను టైట్ హగ్ చేసుకున్న ప్రీతి జింటా.. వీడియో వైరల్!

ఐపీఎల్ 2025లో మరొక సెన్సేషన్ క్రియేట్ చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆశ్చర్యకరమైన విజయం తర్వాత జట్టు ఓనర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా మైదానంలోకి దూసుకొచ్చారు. విజయం ఆనందంలో స్పిన్నర్ చాహల్‌ను హత్తుకుని, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కాగా, చిన్న లక్ష్యాన్ని అందుకోవడంలో కోల్‌కతా పూర్తిగా విఫలమైంది. 15.1 ఓవర్లలోనే 95 పరుగులకు కుప్పకూలిపోయింది. ముఖ్యంగా చాహల్ స్పిన్ మ్యాజిక్‌తో నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాడు. అతని దెబ్బతో కోల్‌కతా ఆటతీరే తలకిందులైంది.

ఈ అద్భుత విజయం అనంతరం ప్రీతి జింటా స్టాండ్స్‌లోనే కాక, మైదానంలో కూడా తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. ప్రత్యక్షంగా చాహల్ వద్దకు వెళ్లి అతనిని టైట్ హగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. చాహల్ కూడా తన ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఫుల్ హ్యాపీగా కనిపించాడు. ఈ క్లిప్స్, ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

నెటిజన్లు “చాహల్ భయ్యా బాలీవుడ్ హీరోయిన్ హగ్ పట్టేశావ్!” అంటూ కామెడీ కామెంట్లు వేస్తున్నారు. మరికొంతమంది “ఇది మ్యాజిక్ కంటే ఎక్కువ” అంటూ మెచ్చుకుంటున్నారు. ప్రీతి జింటా మ్యాచ్ చూస్తూ, ఎగిరి గంతులు వేస్తూ చూపిన ఆనందం అభిమానులకు మర్చిపోలేని మోమెంట్‌గా నిలిచింది.

చేసింది చిన్న స్కోరే అయినా మ్యాచ్‌ అనేక మలుపులు, ఎమోషనల్ మోమెంట్లు, బాలీవుడ్ గ్లామర్ అన్నీ కలిసి ఈ మ్యాచ్‌ 2025 సీజన్‌లో అత్యంత హైలైట్‌ మ్యాచ్ గా నిలుస్తోంది.

ఇన్నింగ్స్ 8, 10 ఓవర్లలో రహానె, రఘువంశీలను ఔట్ చేసిన చాహల్.. 12వ ఓవర్లో రింకు సింగ్, రమణ్ దీప్ లను ఔట్ చేసి కోల్ కతా జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు. ఓడిపోవటం ఖాయం అనుకున్న మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని అందుకోవటంతో ఆ జట్టు ఓనర్ ప్రీతి జింటా సంబరాలు అంబరాన్నంటాయి. స్టాండ్స్ లో ఎగిరి గంతులేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నాలుగు కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన యజ్వేంద్ర చాహల్ ను ప్రీతి జింటా అభినందించారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జంటా.. చాహల్ వద్దకు వెళ్లి టైట్ హాగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాహల్ సైతం ఫుల్ హ్యాపీగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. చాహల్ కు ప్రీతి జింటా టైట్ హాగ్ ఇవ్వడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply