Mohammed Shami: కూతురిని పట్టించుకోవడం లేదంటూ షమీపై భార్య సంచలన ఆరోపణలు

భారత క్రికెటర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహా మధ్య వివాదాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. కొన్నేళ్ల క్రితం విడిపోయిన ఈ జంటకు ఐరా అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె తల్లిదగ్గరే ఉంటోంది. తాజాగా హసీన్ జహా మరోసారి షమీపై సంచలన ఆరోపణలు చేశారు.

షమీ తన కూతురు ఐరాను అసలు పట్టించుకోవడం లేదని, తన గర్ల్‌ఫ్రెండ్స్ పిల్లలకు ఖరీదైన బహుమతులు ఇస్తున్నాడని, వారిని బిజినెస్ క్లాస్ టూర్లకు తీసుకెళ్తున్నాడని కానీ కూతురికి మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. స్కూల్ చదువుకోడానికి కూడా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

షమీపై కోర్టు కేసులు – భరణం ఆదేశం

2018లో హసీన్ జహా, షమీపై గృహహింస కేసు నమోదు చేశారు. తాజాగా కోల్‌కతా హైకోర్టు తీర్పు ప్రకారం షమీ, తన మాజీ భార్యకు నెలకు ₹1.5 లక్షలు, కుమార్తె ఐరాకు నెలకు ₹2.5 లక్షలు – మొత్తంగా ₹4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది.

అయితే మరోవైపు, హసీన్ జహా, ఆమె కూతురు ఐరాపై కూడా క్రిమినల్ కేసు కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో ఒక ఆస్తి వివాదం కారణంగా పొరుగువారిపై దాడి చేశారని ఆరోపణలతో సూరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు సమాచారం.

Leave a Reply