Mitchell Starc : టీ20లకు గుడ్‌బై చెప్పిన మిచెల్ స్టార్క్

ఆస్ట్రేలియా (Australia) ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే 2026 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) కు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. టెస్టులు, వన్డేలపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టార్క్ తెలిపారు. టెస్ట్ క్రికెట్ తన కెరీర్‌లో ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్‌లకు సిద్ధం కావడమే ఈ నిర్ణయం వెనుక కారణమని స్టార్క్ పేర్కొన్నారు. 35 ఏళ్ల మిచెల్ స్టార్క్ టీ20ల్లో 23.81 సగటుతో 79 వికెట్లు తీశాడు. అంతేకాక ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 2021లో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. ఆయన రిటైర్మెంట్‌తో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌ను రూపొందించుకోవాల్సి వచ్చింది.

Also Read: సీబీఐకి కాళేశ్వరం కేసు.. రేవంత్ స్కెచ్‌పై రాజకీయ హీట్

తన కెరీర్‌ను వికెట్ కీపర్‌గా ప్రారంభించిన స్టార్క్, కోచ్ సలహా మేరకు ఫాస్ట్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. ఈ మార్పు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన స్టార్క్, 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 160.4 కి.మీ/గం వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు.ర్క్ భార్య అలీసా హీలీ ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. ఒకే దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మూడో జంటగా వీరు చరిత్ర సృష్టించారు. స్టార్క్ సోదరుడు బ్రాండన్ స్టార్క్ ప్రొఫెషనల్ హైజంపర్. అతను ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు.

అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) ICC ట్రోఫీలు గెలిచిన ఐదుగురు ఆటగాళ్లలో స్టార్క్ ఒకరు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు, 2021 టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆయన కీలక ఆటగాడిగా ఉన్నాడు. అలాగే, 2024 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని $2.98 మిలియన్లకు కొనుగోలు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా స్టార్క్ రికార్డు సృష్టించాడు.

Leave a Reply