ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ కేకేఆర్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ చెంపపై బలంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా మొదలైన దృశ్యం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది.
స్టేడియంలో ఉన్నవారు, టీవీలపై చూస్తున్నవారు ఈ సన్నివేశాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అప్పటివరకు నవ్వుతూ ఉన్న రింకూ, సడెన్‌గా కుల్దీప్ వచ్చి రింకూ చెంపపై బలంగా చేయితోకొట్టగా.. రింకూ ముఖంపై చిరునవ్వు మాయమై షాక్‌గా మారిపోయింది. మరోసారి కొట్టేందుకు ప్రయత్నించగానే రింకూ పక్కకు తప్పుకోవడం గమనార్హం. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లుగా స్టేడియంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి అసలు కారణం మాత్రం ఇంకా బయటపడాల్సి ఉంది.
Things got pretty serious between Rinku Singh and Kuldeep Yadav.pic.twitter.com/8QYBmXzOrV
— chukandar (@kyabataubhai) April 29, 2025
డూ ఆర్ డై మ్యాచ్‌గా నిలిచిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 204 పరుగులు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 190 పరుగులకే పరిమితమై 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
కోల్‌కతా ప్రధాన స్కోరర్లు:
రఘవంశీ – 44 పరుగులు
రింకూ సింగ్ – 36 పరుగులు
సునీల్ నరైన్ – 27 పరుగులు
రహ్మనుల్లా – 26 పరుగులు
రహానె – 26 పరుగులు
ఢిల్లీ ప్రధాన స్కోరర్లు:
డుప్లెసిస్ – 62 పరుగులు
అక్షర్ పటేల్ – 43 పరుగులు
విప్రాజ్ నిగమ్ – 38 పరుగులు
బౌలింగ్ హైలైట్స్:
Kuldeep yadav slaps rinku singh#kuldeepyadav #rinkusingh#KKRvsDC #ipl20225 @imkuldeep18 pic.twitter.com/SEWAgGagwq
— Bobby (@Bobby04432594) April 29, 2025
కోల్‌కతా బౌలర్లు:
సునీల్ నరైన్ – 3 వికెట్లు
వరుణ్ చక్రవర్తి – 2 వికెట్లు
రస్సెల్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా – తలో వికెట్
ఢిల్లీ బౌలర్లు:
మిచెల్ స్టార్క్ – 3 వికెట్లు
అక్షర్ పటేల్ – 2 వికెట్లు
విప్రాజ్ నిగమ్ – 2 వికెట్లు
చమీర – 1 వికెట్
ఈ మ్యాచ్ అనంతరం కుల్దీప్-రింకూ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది సరదాగా జరిగిందా? లేక మరేదైనా లోతైన విషయమా? అన్నది తెలియాల్సి ఉంది.